Kollywood Actor Vishal spotted with mystery woman in New York : కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోతో విశాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇయర్ 'మార్క్ ఆంటోనీ' మూవీతో కోలీవుడ్లో భారీ సక్సెస్ అందుకున్నాడు విశాల్. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి విశాల్ కి భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక విశాల్ వ్యక్తిగత విషయానికి వస్తే, 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు.


విశాల్ ప్రేమ వ్యవహారాలు ఒకప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే ఈ హీరోకి రెండుసార్లు పెళ్లి ఫిక్స్ అయి ఆగిపోయింది. అలాగే రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగదా అది కూడా క్యాన్సిల్ అయింది. ఇదిలా ఉంటే విశాల్ తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. న్యూయార్క్ లో అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై నడుస్తూ కనిపించాడు. అతన్ని అక్కడ కొందరు గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు. కెమెరాకి కనిపించగానే షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు.






న్యూయార్క్ వీధుల్లో అమ్మాయితో విశాల్ పరుగులు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన చాలామంది ఆమె ఎవరంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాల్ మళ్లీ రిలేషన్షిప్ లో ఉన్నారని కొందరు చెబుతుంటే మరికొందరేమో విశాల్ ఎవరికి తెలియకుండా ఫారిన్ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ వీడియోలో విశాల్ రియాక్ట్ అయిన తీరు చూస్తే కావాలని ఇదంతా చేసినట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదంతా తన తదుపరి సినిమా ప్రమోషన్ కోసమే విశాల్ ఇలా చేసి ఉంటారని పలువురు అంటున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


ఇక విశాల్ ప్రస్తుతం రత్నం, డిటెక్టివ్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. రత్నం సినిమాని కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో విశాల్ - హరి కాంబినేషన్లో పొగరు, పూజ వంటి సినిమాలు వచ్చాయి. దాంతో 'రత్నం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గానే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయగా అది కాస్త సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : ‘సాహో’ శ్రద్ధా కపూర్, హిట్లు తక్కువ ఫాలోవర్లు ఎక్కువ - ప్రభాస్, షారుఖ్‌లను మించి.. సరికొత్త రికార్డ్