బాక్సాఫీస్ బరిలో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), జీఏ 2 పిక్చర్స్ జోరు తగ్గలేదు. 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha) కు మంచి వసూళ్ళు వస్తున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా శనివారం (ఫిబ్రవరి 18న) సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్ళు నమోదు చేస్తోందీ సినిమా.
మూడు రోజుల్లో 6.67 కోట్లు!
'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాకు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. అన్ని ప్రీమియర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. శివరాత్రి రోజు కూడా సినిమాకు మంచి ఆదరణ కనిపించిందని, తొలి రోజు సినిమా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు అయిన ఆదివారం కూడా మంచి వసూళ్ళు వచ్చాయి. రెండో రోజు 2.4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.
VBVK Collections : సాధారణంగా మండే నుంచి సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గుతాయి. అయితే, 'వినరో భాగ్యము విష్ణు కథ' విషయంలో అంత డ్రాప్ కనిపించలేదు. మూడో రోజు ఈ సినిమా 1.52 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద మూడు రోజుల్లో 6.67 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
Also Read : హాలీవుడ్‌లో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం - ఆ ఘనత అందుకున్న తొలి హీరోగా రికార్డ్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. 'బన్నీ' వాస్ నిర్మించారు. ఇందులో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించారు. మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు.
'వినరో భాగ్యము విష్ణు కథ'లో కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ, కశ్మీర మధ్య సన్నివేశాలకు మంచి పేరు వస్తోందని చిత్ర బృందం పేర్కొంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాయి. ఒక్క జానర్ అని కాకుండా సినిమాలో మల్టిపుల్ జానర్స్ టచ్ చేశారు. ఎండింగ్ అయితే థ్రిల్లర్ ఫీల్ ఇచ్చిందని ఆడియన్స్ పేర్కొంటున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి - 'ఖుషి' నడుము సీన్ రీ క్రియేట్ చేస్తే?
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ సంస్థలో మరో కమర్షియల్ సక్సెస్ ఇది. గత ఏడాది గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసిన 'కాంతార', 'మాలికాపురం' సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి.
'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మొదట 'వాసవ సుహాస...' పాటను విడుదల చేశారు. ఆ బాణీ, అందులో సాహిత్యం, గానం ఎంత శ్రావ్యంగా ఉన్నాయో ప్రేక్షకులు అందరూ విన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ ఆ పాటను విడుదల చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. సినిమాలో కూడా పాటలు బావున్నాయని పేరు వచ్చింది. తిరుపతి నేపథ్యంలో ఆ పాటలను అందంగా చిత్రీకరించారు.