తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గురింపు తెచ్చుకున్న నటి ఆండ్రియా జెరెమియా. విభిన్న కథలతో తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. `తడాఖా` మూవీతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యింది. కమల్ హాసన్‌తో నటించిన `ఉత్తమ విలన్` సినిమాతోనూ ఆకట్టుకుంది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ మద్దుగుమ్మ తాజాగా లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఆర్ అళగు కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘నో ఎంట్రీ’. జంబో సినిమాస్ బ్యానర్‌పై శ్రీధర్ అరుణాచలం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది.
ఒళ్లు గగుర్పొడిచేలా `నో ఎంట్రీ` ట్రైలర్
ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపడంతో పాటు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. కుక్కల బలాన్ని పెంచితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ఈ ట్రైలర్ లో చూపించారు. నాలుగు కుక్కలు కలిస్తే ఏనుగునైనా చంపేయగల శక్తి ఉంటుందనే వాయిస్ మొదలయ్యే ఈ ట్రైలర్ లో కుక్కలు స్వైరవిహారం చేస్తాయి. కుక్కల బలం పెంచేందుకు ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగం ఏమైంది? కుక్కల్లో పుట్టిన అతి భయంకరమైన వైరస్ మనుషులపై ఎలా దాడి చేసిందనే అంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరణంగా సాగింది. కుక్కలు మనుషులను కరవడం, మనుషులు, మనుషులనే కరవడం వంటి సన్నివేశాలు సినిమా పై ఓ రేంజిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
కుక్కల చూట్టూనే తిరుగుతున్న కథ
కుక్కలకు బలాన్ని పెంపొందించే ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఆండ్రియా తండ్రి. ఆయన చివరగా పంపించిన ఫోటో ఆధారంగా తనను వెతుక్కుంటూ మిత్రులతో కలిసి దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకుంటారు. అడవిలోని కొండ శిఖరంలో ఓ విల్లాలో ఉంటారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీనుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారు? ఈ కుక్కలకు బలం పెంచి ఏం చేయాలి అనుకున్నారు? అనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది.
యాక్షన్ పాత్రలో మెప్పించబోతున్న ఆండ్రియా
ఈ సినిమాను ఆద్యతం థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కించారు. అదవ్ కణ్ణదాసన్,రన్యరావ్, మానస్, జయశ్రీ, జాన్‌వీ ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటివరకు ఫ్యామిలీ, లవ్, కామెడీ చిత్రాల్లో నటించిన ఆండ్రియా.. ఈ చిత్రంలో యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనుంది. అటవీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘నో ఎంట్రీ’ చిత్రంలో ఆమె సరికొత్త పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో ఆండ్రియా ఎంతో సాహసంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ పాత్ర చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది.
Read Also: యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్, ‘సిటాడెల్’ కోసం సమంత ఎంత కష్టపడుతుందో చూశారా!