'సినిమా బండి'తో పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు వికాష్ వశిష్ఠ (Vikas Vasishta). 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ కథ అందించిన 'ముఖచిత్రం'లో ఓ కథానాయకుడిగా నటించారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'నీతోనే నేను' (Neethone Nenu Movie). సీత రామ్ ఆయేషా... అనేది ఉపశీర్షిక. ఇందులో మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు కథానాయికలు. అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. శ్రీ మామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎమ్‌. సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ టైటిల్ పోస్ట‌ర్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జరిగింది. 


'నీతోనే నేను' కథ ఏమిటంటే...
'నీతోనే నేను'లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్రలో వికాస్ వశిష్ఠ కనిపిస్తారని చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''రామ్ ఓ గవర్నమెంట్ టీచర్. విద్యా బోధన, వ్యవస్థలోని లోపాలు సరిదిద్దే క్రమంలో చిత్ర కథ సాగుతుంది. హీరో పాత్రకు వికాస్ వశిష్ఠ వంద శాతం న్యాయం చేశారు. 'సినిమా బండి'లో ఆయన నటన చూసి మా సినిమాకు తీసుకున్నాం. చాలా సహజంగా నటించారు. సీత పాత్రలో మోక్ష, ఆయేషాగా కుషిత చక్కగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం. కార్తీక్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అని చెప్పారు. తానూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా తీయడానికి కారణమైన తన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, స్నేహితుడు నవీన్ కుమార్‌, దర్శకుడు అంజిరామ్‌, నాగరాజులకు థాంక్స్ చెప్పారు.


దర్శకుడ్ని గుడ్డిగా నమ్మి సినిమా చేశా - వికాస్ వశిష్ఠ 
'నీతోనే నేను' సినిమా గురించి కథానాయకుడు వికాస్ వశిష్ఠ మాట్లాడుతూ ''మంచి సినిమా ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. ఆయనతో మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నా. మా దర్శకుడు అంజిరామ్ పైకి సైలెంట్‌గా కనిపిస్తారు. కానీ, లోపల వయలెంట్. ఆయన కథ చెప్పినప్పుడే ఓకే చెప్పా. ఆయన్ను గుడ్డిగా నమ్మేశా. కార్తీక్ మంచి పాటలు ఇచ్చారు. ఆ పాటలకు కుషితతో డ్యాన్స్ చేయడం అంత సులభం ఏమీ కాదు. నెలలో సినిమా విడుదల అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది'' అని చెప్పారు. 


Also Read : పవన్ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న ఊర్వశి రౌతేల - కానీ?


''అనుకున్న సమయంలో సినిమా కంప్లీట్ చేశాం. సుధాకర్ రెడ్డి గారి వల్ల సినిమా బాగా వచ్చింది. బడ్జెట్ సమస్యలు మా వరకు రానివ్వలేదు. సాంగ్స్, కొరియోగ్రఫీ... అన్నీ బాగుంటాయి. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు'' అని చిత్ర దర్శకుడు అంజిరామ్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు మోక్ష, కుషిత కళ్లపు, ప్రభాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నవీన్ స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. శుక్ర‌వారం (జూలై 28) రోజున నిర్మాత సుధాక‌ర్ రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స‌భ్యులు కేక్ కట్ చేసి సెల్ర‌బేష‌న్స్‌ నిర్వ‌హించారు.


Also Read శ్యాంబాబు ఎవరు 'బ్రో' - ఏపీ మంత్రి డ్యాన్స్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్?



వికాస్ వశిష్ఠ, మోక్ష‌, కుషిత కళ్లపు, అకెళ్ల త‌దితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : ముర‌ళీ మోహ‌న్, సంగీతం:  కార్తీక్ బి. క‌డ‌గండ్ల‌, నిర్మాత‌ : ఎమ్‌. సుధాక‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం : అంజిరామ్‌. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial