Vijayakanth Health Update: కోలీవుడ్ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్య సమస్యలతో  కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చెన్నైలోని  MIOT ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన డయాబెటిస్ తో బాధపడుతున్నారు. లివర్ సమస్య కూడా ఉన్నది.  జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన మూడు వేళ్లను  తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులు చెబుతున్నారు.


విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం


తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి చెన్నైలోని MIOT హాస్పిటల్‌ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. విజయ్ కాంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడినా, గత 24 గంటలుగా విషమంగా మారినట్లు వెల్లడించింది. వైద్య చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని చెప్పిన డాక్టర్లు, పరిస్థితి మాత్రం నిలకడగా లేదని తెలిపారు. అతడు కోలుకోవడానికి పల్మనరీ చికిత్సను వైద్య నిపుణులు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు, ఆయన కోలుకోవడానికి మరో 14 రోజుల పాటు నిరంతర చికిత్స అవసరం అని వెల్లడించారు. విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 18న ఆసుపత్రిలో చేరారు. 






ఆందోళనలో డీఎండీకే వర్గాలు


డాక్టర్లు ఇచ్చిన తాజా హెల్త్ అప్ డేట్ తో  డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయన అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వీలైనంత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోకవాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.   


బర్త్ డే వేడుకల్లో పార్టీ కార్యకర్తలను కలిసి విజయ్ కాంత్


ఆనారోగ్యం కారణంగా విజయ్ కాంత్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయ్ కాంత్ ను చూడాలని విజ్ఞప్తి చేయడంతో  ఇటీవల ఆయన కార్యకర్తలను కలిశారు.  పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు పార్టీ కార్యకర్తలు కంటతడి కూడా పెట్టారు. ఆ తర్వాత నుంచి విజయ్ కాంత్‌ ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా మరోసారి ఆరోగ్య సమస్యలు రావడంతో ఈ నెల 18న చైన్నైలోని  ఓ  ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.  విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఇచ్చిన తాజా నివేదికతో డీఎండీకే వర్గాలలో ఆందోళన నెలకొంది.


పార్టీ బాధ్యతలు చూసుకుంటున్న ప్రేమలత


ఇక ప్రస్తుతం డీఎండీకే పార్టీ బాధ్యతలను విజయ్ కాంత్ భార్య ప్రేమలత చూసుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం డీఎండీకే కోశాధికారి పదవిలో కొనసాగుతున్నారు.  70 ఏళ్ల వ‌య‌సున్న విజయ్ కాంత్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. డీఎండీకే పార్టీని స్థాపించారు.


Read Also: ‘ఆవకాయ.. ఆంజనేయ..’ సాంగ్ అద్భుతహా - యూట్యూబ్‌లో అదరగొడుతోన్న ‘హనుమాన్’ పాట


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply