Bollywood’s Biggest Flop Movie: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదేలు చేసింది. మరీ ముఖ్యంగా సినిమా పరిశ్రమను కోలుకోలేని దెబ్బకొట్టింది. దేశ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ మూత పడటంతో ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారు. మిగతా సినిమా పరిశ్రమలతో పోల్చితే, బాలీవుడ్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు ఆ తర్వాతి సంవత్సరంలో పుంజుకున్నప్పటికీ, బాలీవుడ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కరోనా అనంతరం ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడకపోవడంతో పలు సినిమాలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిలో కొన్ని పెద్ద సినిమాలు, మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక డార్క్ కామెడీ హిందీ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా రికార్డు
దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ అనే సినిమా రూపొందింది. 2017లో ఈ సినిమా నిర్మాణం మొదలయ్యింది. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మార్చి 2020లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, ఫిబ్రవరి, మార్చిలో దేశంలో కరోనా మరింత విజృంభించింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను మే వరకు వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ, సినిమా థియేటర్లలో నెలల తరబడి మూతబడ్డాయి. విడుదల తేదీ మరింత ముందుకు పోస్ట్ పోన్ చేశారు. చివరికి, ఈ సినిమా మార్చి 19, 2021న విడుదలైంది. అదే నెలలో కరోనా సెకెండ్ వేవ్ ఆంక్షలను విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రేక్షకులు కరువయ్యారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ దేశ వ్యాప్తంగా కేవలం రూ.40 లక్షలు వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.58 లక్షలు దక్కించుకుంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది.
చిత్రబృందంపై తీవ్ర ప్రభావం
‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిన తర్వాత, ఆ ప్రభావం ఈ సినిమా కోసం పని చేసిన చాలా మంది మీద పడింది. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా కెరీర్ కు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సినిమా తర్వాత అర్జున్ కపూర్ ‘కుట్టే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘ది లేడీ కిల్లర్’తో మరికొన్ని పరాజయాలను చవి చూశాడు. ఇప్పుడు తను రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’లో విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అటు పరిణీతి కూడా ‘సైనా’, ‘కోడ్ నేమ్: తిరంగా’ చిత్రాలతో పరాజయాలను అందుకుంది. ఇప్పుడు అమర్ సింగ్ చమ్కిలా బయోపిక్‌లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి పని చేస్తోంది. దర్శకుడు దిబాకర్ బెనర్జీ మాత్రం‘ సందీప్ ఔర్ పింకీ ఫరార్’ పరాభవం తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.
Read Also: సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2‘పై నాగ చైతన్య కామెంట్స్ - మైండ్ బ్లోయింగ్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply