Kantara Chapter 1: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, పాన్ ఇండియా రేంజిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ -1’ రూపొందుతోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల అయ్యాయి. ఫస్ట్‌ లుక్, టీజర్‌ కి ప్రేక్షకుల నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తున్నది. రిషబ్ శెట్టి లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరహో అనిపించాయి.   


‘కాంతార’ క్లైమాక్స్ సీన్‌తో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ప్రారంభం


‘కాంతార’లో రిషబ్ శెట్టి క్లైమాక్స్ సీన్‌తో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ షురూ అయ్యింది. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు అంటూ కండలు తిరిగిన దేహంతో, ఒళ్లంతా రక్తపు మరకలతో బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో రిషబ్ దర్శనం ఇస్తాడు. ప్రీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రిషబ్‌ తండ్రి జీవితాన్ని టచ్ చేయనున్నారు. ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊరి సంప్రదాయాల వెనుక మూలం ఏంటి? దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు ఆవహిస్తాడు? అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.  


'కాంతార చాప్టర్ -1’లో 15 మంది స్టార్ హీరోలు


ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో తీస్తున్నారు రిషబ్ శెట్టి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో పలు భాషలకు సంబంధించిన స్టార్ హీరోలను నటింపజేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సహా పలు సినిమా పరిశ్రమలకు చెందిన 15 మందికి పైగా నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మంది అగ్ర హీరోలే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం బాగా ప్రచారం జరుగుతోంది. అన్ని భాషల స్టార్స్ ను తీసుకుంటేనే ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వస్తుందని రిషబ్ భావిస్తున్నారట. ఈ సినిమా విషయంలో రిషబ్‌ ఎంతో కష్టపడి గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.


రూ. 120 కోట్లతో 'కాంతార చాప్టర్ -1’ నిర్మాణం


‘కాంతార’ సినిమాను కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన రిషబ్‌.. ప్రీక్వెల్‌ కోసం భారీగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఏకంగా రూ.120 కోట్లతో రూపొందిస్తున్నారట. కేవలం ప్రీ ప్రొడక్షన్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ తో కీలక పాత్రలో పోషించబోతున్నారు. హొంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుద‌ల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


Read Also: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply