HanuMan Movie Avakaya Anjaneya Song: దర్శకుడు ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. టాలీవుడ్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా 'హనుమాన్' రూపొందుతోంది. క్యూట్ బ్యూటీ అమృతా అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సింగిల్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులలో మంచి అంచనాలు పెంచాయి. ‘హనుమాన్’ ఆంథమ్ చిన్న పిల్లలను బాగా అలరించింది.
ఆకట్టుకుంటున్న ‘ఆవకాయ.. ఆంజనేయ..’ సాంగ్
తాజాగా 'హనుమాన్' మూవీకి సంబంధించి మరో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘ఆవకాయ.. ఆంజనేయ..’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది. మన్నెల సింహాచలం లిరిక్స్ అందించగా, అనుదీప్ దేవ్ చక్కటి సంగీతం ఇచ్చారు. గాలిదేవర సాహితీ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటను వింటుంటే మనుసు ప్రశాంతంగా అనిపిస్తోంది. ఓవైపు మామిడికాయ పచ్చడి పెడుతూనే, మరోవైపు విలన్స్ ను హీరో చితక బాదుతున్నట్లు చూపిస్తారు. అయితే, ఈ ఫైట్ ను చాలా పీస్ ఫుల్ గా పాటతో మిక్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాటోగ్రఫీ మరింతగా అలరిస్తోంది. హీరోయిన్ ను సంప్రదాయబద్దంగా అందంగా చూపించారు. తేజ సజ్జ ఫైటింగ్ కూడా చక్కగా రూపొందించారు.
‘హనుమాన్’ కథ ఏంటంటే?
ఈ సినిమాలో హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తాయి. ఆ సూపర్ పవర్స్ తో కుర్రాడు ఏం చేశాడు? ఈ పవర్స్ కారణంగా తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఆయన పవర్స్ ను దేనికోసం వాడాడు? అనేది ఈ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తేజ సజ్జా కెరీర్ లోనే హై టెక్నికల్ వాల్యూస్ తో పాటు భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జాంబిరెడ్డి' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవడంతో ‘హనుమాన్' పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇక యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫస్ట్ మూవీ 'అ!' అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకున్నా, సరికొత్త ప్రయత్నంతో ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ తో 'కల్కి' మూవీ తీసి తనలోని మేకింగ్ టాలెంట్ ని చూపించారు. అనంతరం తేజ సజ్జాతో చేసిన 'జాంబిరెడ్డి' దర్శకుడిగా ప్రశాంత్ వర్మ క్రేజ్ ని మరింత పెంచేసింది. ఈ మూవీలో ప్రశాంత్ స్క్రీన్ ప్లే, మేకింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘హనుమాన్’ సినిమాతో మరోసారి సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: ఆ సన్నివేశాలు చేయడానికి భయపడ్డా, ఆలియా సపోర్ట్ చేసింది: రణబీర్ కపూర్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply