విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) స్టేజ్ ఎక్కితే ఏదో ఒక వివాదం కచ్చితంగా పుడుతుంది. విజయ్ సాధారణంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ అది బయటకు వెళ్లే సరికి కాంట్రవర్సీ అవుతుంటుంది. ఆదివాసీ, ట్రైబల్స్ అంటూ మాట్లాడిన మాటలే పెద్ద వివాదంగా మారాయి. ఆ తర్వాత తన ఉద్దేశం అది కాదంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. కొందరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు వెళ్లారు. ఇక ఇప్పుడు 'కింగ్‌డమ్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాటలు అయితే ఫ్యాన్ వార్ పెట్టేలా ఉన్నాయ్. ఆయన స్పీచ్ అలా ఉంది మరి.

Continues below advertisement

సినిమాకు ముందులా హైప్ ఇవ్వలేదు కానీ...మెగా అభిమానులు హర్ట్ అయ్యేలా స్పీచ్ ఇచ్చాడు!విజయ్ దేవరకొండ ఇది వరకటిలా తన సినిమా గురించి హైప్ ఇవ్వలేదు. ఎక్కువగా చేసి స్పీచులు ఇవ్వలేదు. 'లైగర్' తరువాత సినిమాలపై హైప్ చేస్తూ ప్రమోషన్స్ ఇవ్వడం తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక తాను కాదు... తన సినిమాలే మాట్లాడతాయ్ అని విజయ్ కాస్త సైలెంట్‌గానే ఉంటున్నట్టుగా కనిపిస్తోంది. ఖుషీ, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని అయితే సాధించలేదు. చాలా గ్యాప్, వాయిదాల తర్వాత 'కింగ్‌డమ్' మూవీ జూలై 31న (Kingdom Release Date) రాబోతోంది.

'కింగ్‌డమ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడిన మాటలు మళ్లీ ఫ్యాన్ వార్‌ను పుట్టించేలానే ఉన్నాయి. విజయ్ మాట్లాడుతూ... తన కోసం, తన ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ అంతా కూడా ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారని చెప్పాడు. 'ఐకాన్ స్టార్, సూపర్ స్టార్, టైగర్' అంటూ ఇలా ముగ్గురి హీరోల పేర్లు మాత్రమే పరోక్షంగా చెప్పేశాడు. దీంతో మెగా ఫ్యామిలీని విజయ్ ఇగ్నోర్ చేసినట్టు అయింది.

Continues below advertisement

Also Readఓటీటీలోకి టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మ‌ల‌యాళం డార్క్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే 'కింగ్‌డమ్'ను సపోర్ట్ చేస్తున్నారన్నట్టుగా మారిపోయింది. అయితే ఇది విజయ్ దేవరకొండ కావాలని చేశాడా? లేదా? అన్నది అర్థం కావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్‌ను గానీ, పవన్ కళ్యాణ్‌ను గానీ, చిరంజీవి పేరుని గానీ ఎందుకు అక్కడ చెప్పలేకపోయాడు? అన్నది ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైంలో మెగా ఫ్యామిలీని వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. వాళ్ళే ఫ్లాపుల్లో ఉన్నారని వదిలేశాడా? లేదంటే కావాలని మెగా ఫ్యామిలీ హీరోల పేర్లు చెప్పలేదో గానీ విజయ్ దేవరకొండ చేసిన పని మెగా అభిమానులలో కాస్త ఆగ్రహానికి దారి తీసింది. 

Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'కింగ్‌డమ్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో భాగ్య శ్రీ, సత్య దేవ్ కీలక పాత్రలను పోషించారు.