'ఆడపిల్లనమ్మా... నేను ఆడపిల్లనమ్మా' అంటూ మధు ప్రియ (Singer Madhu Priya) అందరి ఇంట్లోకి అడుగు పెట్టేసింది. తెలంగాణ పోరాటాల్లో తన వంతు పాత్రను పోషించి తన గాత్రంతో అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. అలాంటి ఫోక్ సింగర్ మధు ప్రియ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ మంచి పేరు సంపాదించుకుంది. 'ఫిదా'లో 'వచ్చిండే...' సాంగ్‌తో అందరినీ మెప్పించింది. ఇక రీసెంట్ సెన్సేషనల్ 'గోదారి గట్టు...' అంటూ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది మధు ప్రియ. ఆమె చెల్లెలు శ్రుతి ప్రియా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ ఫోటోలు మధు ప్రియా షేర్ చేయగా... ఆవిడ పెళ్లి గురించి కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.  

Madhu Priya Family Husband: గత కొన్నేళ్లుగా మధు ప్రియ ఒంటరిగానే ఉంటున్నట్లుగా కనిపిస్తోంది. భర్త నుంచి మధు ప్రియ వేరు పడినట్టుగా సమాచారం. ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్నారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. కానీ చాలా ఏళ్ల నుంచి మధు ప్రియ సింగిల్‌గా ఉన్న ఫోటోలు మాత్రమే నెట్టింట్లో కనిపిస్తున్నాయి. తాజాగా మధు ప్రియ చెల్లి ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ఆవిడ పెళ్లి గురించి డిస్కషన్ మొదలైంది.

Also Read: టాలీవుడ్‌లోకి మరో వారసురాలు... నిర్మాతగా మురళీ మోహన్ కుమార్తె... ప్రియాంక ఎంట్రీ

'ఇంటి పెద్దగా మారి కుటుంబాన్ని నడిపిస్తున్నావ్... చెల్లికి పెళ్లి కూడా చేశావ్... కంగ్రాట్స్ అక్కా' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'నీ పెళ్లి సంగతి ఏంటి? గతాన్ని విడిచి ముందుకు సాగు... మళ్లీ పెళ్లి చేసుకో... ఓ తోడంటూ ఉండాలి' అంటూ ఇలా నెటిజన్లు ఆమెకు సలహాలు ఇస్తున్నారు. మరి వీటిపై మధు ప్రియ ఏమైనా స్పందిస్తుందా? అన్నది చూడాలి. అసలు తన పెళ్లి, వైవాహిక సంబంధం గురించి పబ్లిక్‌గా రియాక్ట్ అవుతుందా? లేదా? అన్నది కూడా అనుమానమే. మొత్తానికి మధు ప్రియ మాత్రం తన చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో సందడి చేసింది.

కెరీర్ పరంగా మధు ప్రియకు ఢోకా ఏమీ లేదు. మంచి ఆఫర్లను దక్కించుకుంటూ వెళ్తోంది. షోలు, ఈవెంట్లు, ఓటీటీ షోలు, బుల్లితెరపై కార్యక్రమాలు, సింగింగ్ అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం అస్తవ్యస్తంగానే ఉందనిపిస్తోంది. అప్పట్లో ప్రేమించి, ఇంటి నుంచి పారిపోయి వచ్చి ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆ వివాహాం ఎక్కువ రోజులు నిలబడలేదని టాక్. ఇప్పుడు మరోసారి ఆవిడ పెళ్లి డిస్కషన్ టాపిక్ అవుతోంది.

Also Read'కింగ్‌డమ్‌'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?