Dulquer Salmaan Movies Telugu: భాషలకు అతీతమైన నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన మలయాళీ. అయితే తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయా ఇండస్ట్రీలలో సినిమాలు చేశారు. 'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' - తెలుగులో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడీ హీరో తెలుగు దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadineni)తో పాన్ ఇండియా సినిమా 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) చేస్తున్నారు.
దుల్కర్ పుట్టినరోజు... గ్లింప్స్ విడుదల!'ఆకాశంలో ఒక తార' సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా పతాకం మీద సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ రోజు (జూలై 28న) దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్ విడుదల చేశారు.
Also Read: ఓటీటీలోకి టాలీవుడ్ ప్రొడ్యూసర్ మలయాళం డార్క్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్ చూస్తే... సున్నితమైన భావోద్వేగాలతో హృదయాలను హత్తుకునేలా తీశారని అర్థం అవుతోంది. సాధారణ జీవితాల్లో కనిపించే క్షణాలను అందంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ ఆత్మవిశ్వాసంతో, చాలా ప్రశాంతంగా కనిపించారు. ఇక చివరలో ఓ స్కూల్ స్టూడెంట్ పరుగు తీసే సీన్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం గ్లింప్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా
Aakasamlo Oka Tara Release: 'ఆకాశంలో ఓ తార' సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: పవన్ సాధినేని, రచన - గంగరాజు గుణ్ణం, సంగీతం: జీవీ ప్రకాష్, ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్వేత సాబు సిరిల్, నిర్మాతలు: సందీప్ గుణ్ణం - రమ్య గుణ్ణం, నిర్మాణ సంస్థ: లైట్ బాక్స్ మీడియా, సమర్పణ: గీతా ఆర్ట్స్ - స్వప్న సినిమా.