Sai Dhanshika's Horror Thriller Cheekati Movie OTT Streaming On Youtube: చూస్తుండగానే... పట్టపగలే చీకటి పడే ఊరు. అదే సమయంలో దారుణంగా 6 హత్యలు. అందరినీ ఒకేలా మెడ విరిచి చంపేస్తారు. ఏంటి చదువుతుంటూనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా. ఇలాంటి హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ ఫ్రీగా చూసేయండి.

హారర్ థ్రిల్లర్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్‌కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మూవీ 'చీకటి'. హారర్‌తో పాటు క్రైమ్, సైకలాజికల్ ఇలా ఎన్నో అంశాల బ్యాక్ డ్రాప్‌గా మూవీని తెరకెక్కించారు. 2019లో రిలీజ్ అయిన తమిళ మూవీ 'ఇరియట్టు'కు ఇది రీమేక్. ఈ మూవీలో సుందర్ సి, సాయి ధన్సిక, సాక్షి చౌదరి, విమలా రామన్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు.

ఫ్రీగా చూసేయొచ్చు

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఆద్యంతం హారర్, థ్రిల్లింగ్ అంశాలు పంచే ఈ 'చీకటి' మూవీని తెలుగులో 'యూట్యూబ్'లో ఫ్రీగా చూసెయ్యొచ్చు. ఈ మూవీకి దురై దర్శకత్వం వహించారు. సాధారణ హారర్ థ్రిల్లర్స్ కంటే డిఫరెంట్‌గా ఉండే ఈ మూవీని ఇప్పుడే చూసెయ్యండి.

Also Read: ఎర్ర చందనం స్మగ్లింగ్‌ ఉచ్చులో యంగ్ బాక్సర్ - రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ

స్టోరీ ఏంటంటే?

ఆ గ్రామంలో పట్టపగలే సడన్‌గా దట్టమైన మేఘాలు కమ్ముకుని చీకట్లు అలుముకుంటాయి. అదే టైంలో వేర్వేరు పనులు చేసుకుంటున్న ఆరుగురు గ్రామస్థులు దారుణ హత్యకు గురవుతారు. ఒకరిని పాము, ఇంకొకరిని చెద పురుగులు, ఇంకొకరు గొంతులో కట్టె గుచ్చుకుపోయి ఇలా అందరూ చనిపోతున్నట్లు కనిపించినా... అందరినీ ఒకే రీతిలో మెడ విరిచి ఎవరో చంపేస్తారు. ఒకే టైంలో ఒకేసారి హత్యలు జరగడంతో పోలీసులకు సవాల్‌గా మారుతుంది. అయితే, విచారణ చేస్తోన్న పోలీస్ ఆఫీసర్‌కు ఓ క్లూ దొరుకుతుంది. అదేంటో తెలిసే లోపే ఆ ఆఫీసర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటాడు.

వరుస హత్యలు, పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య కేసును ఛేదించేందుకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ (సుందర్ సి) ఆ ఊరికి ట్రాన్స్ ఫర్ అయి వస్తారు. కేసు విచారించే క్రమంలో ఆయనకు అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతలో అతని కుమార్తె దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది. ఇంతలో గ్రామంలో ఓ మాంత్రికుడు రహస్యంగా పూజలు చేయడం గమనిస్తాడు పోలీస్ ఆఫీసర్. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఆ గ్రామానికి ఉన్న శాపం ఏంటి? తన కుమార్తె ఎందుకు అలా ప్రవర్తించింది. అసలు జరుగుతున్న వాటి వెనుక ఉన్నది ఆత్మలేనా? వాటి నుంచి తన కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని పోలీస్ ఆఫీసర్ ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.