మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన తాను సినిమాల మీద మక్కువతో చిత్రసీమలోకి వచ్చానని జగదీష్ ఆమంచి (Jagadeesh Amanchi) తెలిపారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'యముడు' (Yamudu Movie). ఇదొక మైథలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌. ధర్మో రక్షతి రక్షితః... అనేది ఉప శీర్షిక. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో శ్రావణి శెట్టి హీరోయిన్‌. ఇటీవల ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. సినిమాలో పాటల్ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్, 'కే మ్యూజిక్' సీఈవో ప్రియాంక, మల్లిక విడుదల చేశారు. 

కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలే కథగా!ప్రస్తుతం ఎటు చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయని, తాము ఆ పాయింట్‌ మీద 'యముడు' తీశామని, ఈ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంటుందని జగదీశ్ ఆమంచి చెప్పారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ... ''ఇటీవల చిన్న సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. 'యముడు' కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. జగదీష్ ఎన్నో కష్టనష్టాలు పడి హీరోగా, దర్శక - నిర్మాతగా మారి 'యముడు' తీశారు. తొలి సినిమాకు ప్రయోగాత్మక కథ ఎంపిక చేసుకోవడం మంచి విషయం. పాటలు బావున్నాయి. హీరోయిన్ శ్రావణి శెట్టికి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.

Also Readసింగిల్ స్క్రీన్స్, థియేటర్స్‌ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!

మన జీవితాల్లో జరిగే ఘటనలు, కొందరు చేసే తప్పులే 'యముడు'లో చూపించారని, ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అయ్యేలా జగదీశ్ ఆమంచి సినిమా తెరకెక్కించారని, ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఆయన ముందుకు వెళ్లారని హీరోయిన్ శ్రావణి శెట్టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాష్, భవానీ రాకేష్, స్క్రీన్ ప్లే రైటర్ శివ, కెమెరామెన్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. 

జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా ప్రధాన పాత్రల్లో నటించిన 'యముడు' సినిమాకు నిర్మాణ సంస్థ: జగన్నాధ పిక్చర్స్, కథ - దర్శకుడు - నిర్మాత: జగదీష్ ఆమంచి, రైటర్: హరి అల్లసాని - జగదీష్ ఆమంచి, స్క్రీన్ ప్లే: శివ కుండ్రపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రజిని ఆమంచి, కూర్పు: కెసిబి హరి, ఛాయాగ్రహణం: విష్ణు రెడ్డి వంగా, సంగీతం: భవాని రాకేష్.

Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా