Satyadev's Arabia Kadali OTT Release On Amazon Prime Video: ఓటీటీ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా మరో సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లో భాగంగా ఎక్స్‌క్లూజివ్‌గా 'అరేబియా కడలి' సిరీస్ రూపొందించగా... తాజాగా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఆగస్ట్ 8 నుంచి 'అరేబియా కడలి' సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. 'కాలం, ఆటుపోట్లు ఎవరి కోసం వేచి ఉండవు. వాటి విధి కూడా వేచి ఉండదు.' అంటూ రాసుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సిరీస్‌కు రచయిత, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సూర్య కుమార్ దర్శకత్వం వహించగా... ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మించారు.
Also Read: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
స్టోరీ లైన్ ఏంటంటే?
రెండు గ్రామాల మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి పొరపాటున బార్డర్ క్రాస్ చేసి ఇతర దేశాల జలాల్లోకి వెళ్లిపోతారు. దీంతో అక్కడి అధికారులు వీరిని బందీలుగా పట్టుకుంటారు. వీరు అక్కడి నుంచి ఎలా బయటకకు వచ్చారు అనేదే ప్రధానాంశంగా ఈ సిరీస్ రూపొందించారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సిరీస్ ఉండబోతుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. 2024లోనే సిరీస్ షూటింగ్ ప్రారంభించారు. ఇదే స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో పలు మూవీస్ వచ్చినప్పటికీ ఈ సిరీస్ స్టోరీ ఒరిజినల్ అని తెలిపారు.