Dulquer Salmaan's Kaantha Teaser Released: దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో స్టార్ హీరోగా దుల్కర్, డైరెక్టర్‌గా సముద్ర ఖని కనిపించనున్నారు. రెట్రో లుక్‌లో మరోసారి దుల్కర్ అదరగొట్టారు. సెప్టెంబర్ 12న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.
సినిమా పేరు 'శాంత' కాదు 'కాంత'
'మోడర్న్ స్టూడియోస్' దర్శక శిఖామణితో రూపొందించబోతున్న చిత్రం 'శాంత' తెలుగులో మొదటి హారర్ ఫిల్మ్ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... సముద్ర ఖని సినిమాలో సీనియర్ డైరెక్టర్ రోల్ చేస్తున్నారు. ఓ సినిమా విషయంలో డైరెక్టర్, హీరోకు మధ్య జరిగే ఘర్షణ బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో అప్పటి హీరో, డైరెక్టర్ మధ్య ఏం జరిగింది?, ఒకరికొకరు ప్రేమ, అనుబంధంతో ఉన్న ఇద్దరు బద్ద శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది ఆసక్తిని పెంచేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ సముద్రఖనిని డామినేట్ చేస్తుండగా... 'సినిమా పేరు శాంత కాదు కాంత' అంటూ టైటిల్‌నే మార్చేయడం మరింత హైప్ క్రియేట్ చేసింది.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రిష్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అరేబియా కడలి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా... స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ పిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఝును మ్యూజిక్ అందిస్తుండగా... రానా (Rana Daggubati) కూడా ఓ కీలక రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన డిటెక్టివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో 'మహానటి' సినిమాలో శివాజీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ సేమ్ రోల్‌లోనే అదరగొట్టారు. ఈ మూవీలోనూ 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో స్టార్ హీరోగా న్యూ హెయిర్ స్టైల్, సూట్‌తో ఇంటెన్స్ లుక్‌లో అదరగొట్టారు.
దుల్కర్ వరుస మూవీస్
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). రీసెంట్‌గా వచ్చిన 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నారు. 'సీతారామం' మూవీ ఆయనకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. కురుప్, కనులు కనులు దోచాయంటే, జనతా హోటల్, అందమైన జీవితం మూవీస్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా 'కాంత' మూవీ కూడా హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.