Vyasanasametham Bandhumithradhikal OTT Release Date and Streaming Platform: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించిన మలయాళం మూవీ 'వ్యసనసమేతం బంధుమిత్రాధికల్' ఓటీటీలోకి వస్తోంది. ఆ డార్క్ కామెడీ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫామ్ రివీల్ చేయలేదు. 'వ్యసనసమేతం బంధుమిత్రాధికల్' పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మనోరమా మ్యాక్స్... త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది.
'రేఖచిత్రం' ఫేమ్ అనశ్వర రాజన్ కథానాయికగా!'వ్యసనసమేతం బంధుమిత్రాధికల్' సినిమాలో 'రేఖా చిత్రం' ఫేమ్ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. సిజు సన్నీ, జోమోన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్ విపిన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మలయాళ దర్శకుడు విపిన్ దాస్‌తో కలిసి తెలుగు నిర్మాత సాహు గారపాటి నిర్మించారు. ఈ కామెడీ మూవీతోనే సాహు గారపాటి నిర్మాతగా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన నిర్మించిన 'భగవంత్ కేసరి' మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర్ వరప్రసాద్ గారు' ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మొదటి నుంచి పాజిటివ్ టాక్... థియేటర్లలో మంచి హిట్!జూన్ రెండో వారంలో థియేటర్లలో రిలీజైన 'వ్యసనసమేతం బంధుమిత్రాధికల్' పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్‌తో పాటు సిట్యూవేషన్ కామెడీతో ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పించింది. అనశ్వర రాజన్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఈ మలయాళం మూవీ రన్‌టైమ్ గంట యాభై నాలుగు నిమిషాలే కావడం గమనార్హం.
పెళ్లింట చావు... సినిమా కథ ఏమిటి? హిట్ టాక్ వెనుక రీజన్?అంజలి (అనశ్వర రాజన్) ఓ మిడిల్ క్లాస్ యువతి. ఆమెకు పెళ్లి కుదురుతుంది. పెళ్లి పనులు మొదలు పెడతారు. అదే టైమ్‌లో అంజలి బామ్మ సావిత్రి గుండె పోటుతో కన్నుమూస్తుంది. ఆ తర్వాత ఏమైంది? బామ్మ చావు కారణంగా అంజలి పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? సావిత్రి అంత్యక్రియల్లో ఎలాంటి గందరగోళం చోటుచేసుకుంది అన్నదే ఈ మూవీ కథ.
Also Read: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
ప్రస్తుతం తెలుగులో టాప్ ప్రొడ్యూసర్లతో ఒకరిగా కొనసాగుతోన్నారు సాహు గారపాటి... తెలుగులో బాలకృష్ణ 'భగవంత్ కేసరి', ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న చిరంజీవి సినిమా కంటే ముందు మరికొన్ని సినిమాలు చేశారు. అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' నిర్మించినది ఆయనే. అల్లరి నరేశ్ 'ఉగ్రమ్', నేచురల్ స్టార్ నాని 'కృష్ణార్జున యుద్ధం', విశ్వక్ సేన్ 'లైలా'తో పాటు మరికొన్ని సినిమాలు నిర్మించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'కిష్కిందపురి' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా