'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన సమంత (Samantha) కథానాయికగా నటించిన సినిమా 'ఖుషి' (Kushi Movie). సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.


'ఖుషి' ప్రేమలో పెయిన్!
Yedhaki Oka Gaayam Song : 'ఖుషి' సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదల చేశారు. ఆ మూడూ ప్రేమ, సంతోషం గురించి చెప్పేవే. అయితే... ఈ సినిమాలో లవ్ ఫెయిల్యూర్ తరహా సాంగ్ కూడా ఒకటి ఉంది. ప్రేమలో పెయిన్ ఏంటో తెలియజేసే ఆ పాటను గురువారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు.


'యెదకు ఒక గాయం...' అంటూ సాగే ఆ పాటకు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. సినిమాలో అన్ని పాటలూ ఆయన రాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహెబ్ అడగటం, కరోనా కారణంగా కొంత సమయం లభించడంతో తాను పాటలన్నీ రాశానని, అలాగని తన తదుపరి చిత్రాల్లో పాటలు రాసే ఉద్దేశం లేదని, అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని శివ నిర్వాణ చెప్పారు. 


విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ అదుర్స్! 
సినిమా విడుదలకు 15 రోజుల ముందు 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్' పేరుతో ఆగస్టు 15న హైదరాబాద్‌లో భారీ ఫంక్షన్ నిర్వహించారు. అందులో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, సమంత చేసిన పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించింది. సినిమాపై అంచనాలు పెంచింది.


Also Read : స్టేజిపై విజయ్ దేవరకొండతో సమంత డ్యాన్స్ - వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీయే వేరు, ఫొటోలు చూశారా?


ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో మాస్, కమర్షియల్ సినిమాలు ఎక్కువగా విడుదల అయ్యాయి. అయితే... 'ఖుషి' ప్రేమకథ. లవ్ యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఆడియో హిట్ కావడం సినిమాకు ప్లస్ అయ్యింది. 


Also Read : దేవరకొండ ఫ్యామిలీ @ 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'


విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, ఆలీ, శరణ్య పొన్నవణ్నన్, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మేకప్ : బాషా, కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్ - హర్మన్ కౌర్ - పల్లవి సింగ్, కళా దర్శకత్వం : ఉత్తర కుమార్ - చంద్రిక, పోరాటాలు : పీటర్ హెయిన్, రచనా సహకారం : నరేష్ బాబు .పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : దినేష్ నరసింహన్, కూర్పు : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, ఛాయాగ్రహణం : జి. మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని - రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, కొరియోగ్రఫీ, దర్శకత్వం : శివ నిర్వాణ.