సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రోజునే థియేటర్లలోకి ఎప్పుడు వచ్చేదీ చెప్పడం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైల్. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో కొత్త సినిమాకు కూడా ఆయన అదే స్టైల్ ఫాలో అయ్యారు. 'లైగర్' విడుదలకు ముందే పూరి, విజయ్ దేవరకొండ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ రోజు ముంబైలో ప్రారంభమైంది.

 

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కలయికలో 'లైగర్' తర్వాత రూపొందుతున్న సినిమాకు 'జెజిఎమ్' (JGM Movie) టైటిల్ ఖరారు చేశారు. 'జెజిఎమ్' అంటే 'జన గణ మణ' (Jana Gana Mana). ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఆల్రెడీ ఓపెనింగ్ రోజున ఆయన డ్రస్ చూస్తే... ఆ సంగతి తెలుస్తుంది. ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి కథాంశంతో సినిమా రూపొందనుంది (Vijay Devarakonda JGM is War Based Action Entertainer).

 


 

'జన గణ మణ' సినిమాను శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స పతాకాలపై ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రమిది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 3న విడుదల (JGM - Jana Gana Mana World Wide Release on AUG 3rd,2023) చేయనున్నట్టు ప్రకటించారు.