వెండితెరపై శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్న సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). యంగ్ రెబల్ స్టార్, బాహుబలి అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్‌ను ఎప్పుడెప్పుడు చూదామా? అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్. శ్రీరామ నవమికి రాముడిగా ప్రభాస్‌ను ప్రేక్షకులకు చూపించాలని చిత్ర బృందం భావిస్తోందని సమాచారం.
రామాయణం ఆధారంగా తీస్తున్న సినిమాకు శ్రీరామ నవమి కంటే మంచి సందర్భం ఏం ఉంటుంది? అందుకని, 'ఆదిపురుష్' మోషన్ పోస్టర్ (Adipurush Motion poster) ను రాముడి పండక్కి విడుదల చేయాలని నిర్ణయించారట. మోషన్ పోస్టర్ లో ప్రభాస్ రూపం కూడా చూపించే అవకాశం ఉందని సమాచారం. ఆ రోజు ఫస్ట్ లుక్ (Prabhas First Look - Adipurush) విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే నిజమైతే ఆ రోజు ఇంటర్నెట్ షేక్ అవ్వడం ఖాయం.
Also Read: మూడు రోజుల్లో రూ. 500 కోట్లు, వసూళ్ల వేటలో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త చరిత్ర
'ఆదిపురుష్' సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీస్తున్నారట. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 12, 2023న ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' త్రీడీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.