Vijay Sethupathi's Viduthalai Part 2 / Vidudala Part 2 Review: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా తమిళ దర్శకుడు వెట్రిమారన్ తీసిన సినిమా 'విడుదల పార్ట్ 2'. ఇందులో మంజూ వారియర్ హీరోయిన్. సూరి ప్రధాన పాత్రలో, విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటించిన 'విడుదల పార్ట్ 1' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పార్ట్ 2 మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మంజూ వారియర్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల పడ్డాయి. మరి, సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో జనాలు ఏమంటున్నారు? అనేది చూస్తే...
కల్ట్ క్లాసిక్... ఒక్కటే మాట - కోలీవుడ్ హ్యాపీ!
చెన్నైలో కొంత మందికి గురువారం రాత్రి 'విడుదల పార్ట్ 2' స్పెషల్ ప్రీమియర్ షోస్ వేశారు. వాళ్ళు చెప్పేది ఒక్కటే మాట... సినిమా కల్ట్ క్లాసిక్ అని! దాంతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇయర్ ఎండ్ మంచి సినిమాతో ముగింపు పలుకుతున్నట్లు అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తోంది.
పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి నటన అద్భుతం అని కోలీవుడ్ అంటోంది. విజయ్ సేతుపతిలో మరో షేడ్ 'విడుదల పార్ట్ 2'లో చూస్తారని అంటోంది. తన నటనతో స్క్రీన్ మీద ఫైర్ పుట్టించారట. దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran)కు అయితే మరొక నేషనల్ అవార్డు గ్యారంటీ అంటున్నారు కోలీవుడ్ జనాలు.
'విడుదల పార్ట్ 2' బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని, స్పాయిలర్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూడమని సలహా ఇస్తున్నారు. మరి, ఈ సినిమాకు తెలుగు - తమిళ భాషల్లో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
దర్శకుడు వెట్రిమారన్ 'విడుదల పార్ట్ 1' తీయడం మొదలు పెట్టినప్పుడు... సూరి హీరో అయితే, ఆ సినిమాలో విజయ్ సేతుపతిది స్పెషల్ రోల్ మాత్రమే. ఆయన్ను పది పదిహేను రోజుల డేట్స్ అడిగారు. ఆ క్యారెక్టర్ షూటింగ్ కోసం అన్ని రోజులు సరిపోతాయని అనుకున్నారు. కట్ చేస్తే... 'విడుదల' కోసం విజయ్ సేతుపతి 120 రోజులకు పైగా షూటింగ్ చేశారు. 'విడుదల 2'తో కథకు ఎండ్ కార్డు పడటం లేదు. సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంది. 'విడుదల 3' కోసం కొంత షూటింగ్ చేసి పెట్టారు కూడా!
Also Read: మెడలో మంగళ సూత్రంతోనే కీర్తి సురేష్ - బాలీవుడ్ సినిమా ప్రమోషన్‌లోనూ ట్రెడిషన్స్ వదల్లేదు