రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేబీ. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఆనంద దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్ర పోషించారు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత ఎస్ కే ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకంటే ముందే అంటే జూలై 13నే ఈ సినిమా ప్రీమియర్స్ ని వేశారు చిత్ర నిర్మాతలు. 'బేబీ' మూవీ ప్రీమియర్స్ సందర్భంగా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులతో పాటు విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా హాజరయ్యారు. ఇక విజయ్, రాశి ఖన్నా అలా థియేటర్స్లోకి ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు వాళ్ళని చూసి కేరింతలు వేస్తూ తెగ సందడి చేశారు.
కాగా ప్రేక్షకులతో కలిసి 'బేబీ' ప్రీమియర్స్ ని వీక్షించిన విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగుందని, ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని, మొత్తానికి ఏడిపించేసారని చెప్పారు. అయితే రాశి ఖన్నా సైతం ఈ సినిమా చూసిన అనంతరం సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు రాశి ఖన్నా మాట్లాడుతూ.." బేబీ సినిమాలో చాలా మంచి లవ్ స్టోరీ ఉందని, ఈ సినిమాని చూస్తున్నంత సేపు నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయని చెప్పారు. ఆనంద్, వైష్ణవి చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఇక ఈ సినిమాని మన SKN గారు ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఎప్పుడూ మంచి కంటెంట్ ని డెలివరీ చేస్తారు. నేను కూడా ఈ మూవీ ప్రీమియర్స్ లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే డైరెక్టర్ సాయి రాజేష్ గారు కూడా సినిమాను బాగా తీశారు. మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో ప్రతి పాట నాకు నచ్చింది. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. అందరూ థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాని చూడండి" అంటూ రాశిఖన్నా చెప్పుకొచ్చింది.
దీంతో బేబీ మూవీ పై రాశిఖన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ కి రాశిఖన్నా, విజయ్ దేవరకొండ తో కలిసి వచ్చింది. దీంతో వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్, రాశిఖన్నా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ఇక 'బేబీ' సినిమా విషయానికొస్తే.. 'కొబ్బరిమట్ట', 'హృదయ కాలేయం' వంటి కామెడీ సినిమాలను డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నాగ బాబు, లిరీష, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన, ఇతర కీలక పాత్రలు పోషించారు. MN బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. విప్లవ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read : ‘బేబీ’ సక్సెస్‌పై విజయ్ ఆనందం - రిలీజ్‌కు ముందే స్ట్రీమ్ రైట్స్ కొనేసిన ఆ ఓటీటీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial