Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ఈ మూవీ జులై 14 న విడుదల అయింది. ప్రస్తుతం మూవీకు పాజిటివ్ టాక్ వస్తోంది. మూవీ రిలీజ్ కు ముందు ప్రీమియర్ షో ను వేశారు. ఈ షో ను విజయ్ దేవరకొండ నటి రాశీ ఖన్నాతో కలసి వీక్షించారు. షో అనంతరం మూవీ గురించి మాట్లాడారు విజయ్. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


‘బేబీ’ కన్నీళ్లు పెట్టించింది: విజయ్ దేవరకొండ


‘బేబీ’ సినిమా ప్రీమియర్ షో ను హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో వీక్షించారు విజయ్. మూవీ పూర్తయిన తర్వాత బయటకొచ్చి సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు. ప్రీమియర్ షో కు ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదని, అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ‘బేబీ’ సినిమా కన్నీళ్లు పెట్టించిందన్నారు. దర్శకుడు సాయి రాజేష్ మంచి ఎమోషనల్ సినిమాను తెరకెక్కించారని చెప్పారు. సినిమాలో యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారని, కచ్చితంగా ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంటుందని అన్నారు.  మూవీ రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ లో మళ్లీ కలుద్దాం అని చెప్పుకొచ్చారు. మూవీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు విజయ్. 


రాశీ ఖన్నాతో కలసి సందడి చేసిన విజయ్..


‘బేబీ’ సినిమా ప్రీమియర్ షో కు విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా కలసి వెళ్లారు. హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో ‘బేబీ’ సినిమాను వీక్షించారు. విజయ్, రాశీ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వారితో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఫ్యాన్స్ తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మళ్లీ వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో రాశీ ఖన్నా, విజయ్ ఇద్దరూ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. 


ఆనంద్ కు కమర్షియల్ హిట్ వచ్చినట్టేనా?


టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన బాటలోనే విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 లో ‘దొరసాని’ సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు ఆనంద్. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’, ‘హైవే’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఓ వినూత్నమైన లవ్ స్టోరీతో మళ్లీ ప్రేక్షకుల ముందుక వచ్చారు. ఈ సినిమాపై ముందు నుంచే హైప్ క్రియేట్ అయింది. దీంతో మూవీ రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలోని నటీనటుల నటన, పాటలు, కథకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు, క్లైమాక్స్ ఇంకాస్త బాగుంటే బాగుండేది అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఓ నాలుగు రోజులు గడిస్తేనే గానీ సినిమా హిట్టా కాదా అనేది తెలుస్తుంది. మరి ఈ మూవీ ఆనంద్ కు కమర్షియల్ హిట్ అందిస్తుందో లేదో చూడాలి. 


Also Read: తెలుగులో విశాల్ పాట - 'మార్క్ ఆంటోనీ' కోసమే మామా! 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial