Samantha Healing Journey : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు తన నటనా జీవితానికి కొంత కాలం విరామం ప్రకటించనుందన్న వార్తలపై ఆమె హెయిర్ స్టైలిస్ట్, స్నేహితుడు రోహిత్ భట్కర్ క్లారిటీ ఇచ్చారు. తన చికిత్స కోసం ఆమె కొన్ని రోజుల పాటు యాక్టింగ్ కు దూరంగా ఉండనున్నారని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మయోసైటిస్ వ్యాధి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన సమంత.. ఇటీవలే 'సిటాడెల్' షూటింగ్ ను కంప్లీట్ చేసింది. అయితే ఆమెపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆమె హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ స్పందించారు. "మీరు చికిత్స తీసుకునే సమయంలో మరింత బలం, శక్తి కలగాలని కోరుకుంటున్నారు. మీరు ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా మరింత బలంగా కావాలని ఆశిస్తున్నాను. మీరు మళ్లీ వచ్చే వరకు మీ రాక కోసం ఎంతో ఎదురుచూస్తూ ఉంటాం" అంటూ ఆయన తన భావాలను ఇన్ స్టాగ్రామ్ పోస్టులో రాసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఓ ఫొటోను కూడా రోహిత్ షేర్ చేశారు. ఈ పోస్ట్ పై స్పందించిన సమంత.. భావోద్వేకపూర్వకరమైన రిప్లై ఇచ్చింది. మనసును హత్తుకునేలా చేసిన రోహిత్ పోస్టుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.
గత సంవత్సరం సమంతకు మయోసైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఆమె అమెరికాలో చికిత్స పొందేందుకు ఆమె తన కెరీర్‌కు విరామం తీసుకోవాల్సి వచ్చింది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత, సమంత పరిశ్రమకు మళ్లీ తిరిగి వచ్చింది. ఆమె కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం సమంత తన ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తి చేసి, తన హీలింగ్ జర్నీపై దృష్టి పెట్టేందుకు విరామం తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది.
విరామం వార్తలపై క్లారిటీ..
సమంత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకొని చికిత్స చేయించుకుంటారన్న వార్తలపై ఆమె రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాని తెలియజేస్తూ భావోద్వేగమైన వ్యాఖ్యలు రాసుకొచ్చింది. ఇప్పుడు బ్రేక్ తీసుకోవడం చెడు విషయంగా అనిపించడం లేదన్న సమంత.. 'సిటాడెల్' టీమ్‌తో తన అనుబంధాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. “సిటాడెల్: ఇండియా షూటింగ్ పూర్తి చేసుకున్నా. ఏం జరుగుతుందో ముందే తెలిసినప్పుడు బ్రేక్ తీసుకోవడం చెడు విషయం కాదని అనిపిస్తోంది. రాజ్ అండ్ డీకే నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. నన్ను ఎప్పుడూ వదులుకోవాలని అనుకోనందుకు, ప్రతీ యుద్ధంలో పోరాడేందుకు నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలో అన్నింటి కన్నా ఎక్కువగా మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా. నా జీవితంలో భాగమైనందుకు థాంక్యూ” అని సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుతో సమంత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోవడం నిజమేనని తెలుస్తోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial