తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao)ది నాలుగు దశాబ్దాల సుధీర్ఘ ప్రయాణం. ఎన్టీఆర్, అక్కినేని తరం హీరోల నుంచి ఈ తరం యువ కథానాయకుల వరకు అందరితోనూ ఆయన నటించారు. విలక్షణ నటనతో తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాస రావు ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కోట శ్రీనివాసరావు మృతికి కారణం ఏమిటి?
Reasons for Kota Srinivasa Rao Death: కోటా శ్రీనివాస రావు వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా కోట ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆదివారం హైదరాబాద్ సిటీలోని ఫిలిం నగర్ ప్రాంతంలోని తన నివాసంలో కన్ను మూశారు.
కోట స్వస్థలం ఎక్కడ? ఎప్పుడు జన్మించారు?
Kota Srinivasa Rao Age, Date Of Birth: కోటా శ్రీనివాస రావు స్వస్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలోని కంకిపాడు. ఆయన జూలై 10, 1942లో జన్మించారు. సినిమాల్లోకి రావడానికి ముందు రంగస్థలం మీద మెరిశారు. పలు నాటకాలలో తనను నటనతో ప్రేక్షకులను ఆలరించారు.
రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాస రావుకు తొలి అవకాశం దర్శక నిర్మాతలు కె వాసు, క్రాంతి కుమార్ ఇచ్చారు. 'ప్రేమ ఖరీదు' సినిమాతో ఆయనను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేశారు కోట. ఆ తర్వాత ప్రతి నాయకుడిగా తనదైన విలనిజం. పండించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరం హీరోలతో పలు సినిమాలు చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లోనూ నటించారు. ఈ తరం యువ హీరోలు సాయి దుర్గా తేజ్‌తోనూ పని చేశారు.
రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసిన కోట!
Kota Srinivasa Rao First Movie: నటుడిగా మాత్రమే కాదు.... రాజకీయ నాయకుడిగా కూడా కోట శ్రీనివాస రావు ప్రజలకు సేవ చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన కొన్నాళ్లు కొనసాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. కోట మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను అధిగమించే ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.