మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' గుర్తుందా? అందులో సినిమా డైరెక్టర్ రోల్ చేసిన హీరో గుర్తు ఉన్నారా? ఆ... అథర్వ మురళి. అతను హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ్ హిట్ 'డీఎన్ఏ'. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో విడుదలకు రెడీ అయ్యింది. 

తెలుగులోకి 'మై బేబీ'గా రానున్న 'డీఎన్ఏ'Atharvaa Murali's DNA Release In Telugu: 'డీఎన్ఏ' సినిమాను తెలుగులో 'మై బేబీ' పేరుతో డబ్బింగ్ చేశారు. ఇంతకు ముందు 'ప్రేమిస్తే', 'జర్నీ', 'షాపింగ్‌ మాల్‌', 'పిజ్జా' వంటి విజయవంతమైన తమిళ చిత్రాలను తెలుగులో అనువదించి మంచి విజయాలు అందుకున్న ఎస్.కె. పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి ఈ సినిమాను తెలుగులో అనువదించారు.

Also Read'సూత్రవాక్యం' రివ్యూ: అబ్బాయి మిస్సింగ్ కేసులో బయటపడ్డ అమ్మాయి మర్డర్... తెలుగు నిర్మాతలు తీసిన మలయాళ సినిమా ఎలా ఉందంటే?

'మై బేబీ' సెన్సార్ పూర్తి అయ్యిందని, ఈ నెల 18న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సురేశ్‌ కొండేటి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''తమిళంలో 'డీఎన్ఏ' ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులనూ సినిమా ఆకట్టుకుంటుంది. సెన్సార్ పనులు పూర్తి చేశాం. అథర్వ మురళి, నిమిషా సజయన్‌ జంట అద్భుతంగా నటించింది. ఇదొక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్'' అని చెప్పారు.

Also Readసూపర్ మ్యాన్ రివ్యూ: హాలీవుడ్ సినిమాలో కమల్ హాసన్ 'ఇండియన్ 2'ను గుర్తు చేసే ఆ ఒక్క సీన్... మరి, సినిమా? డీసీ హిట్టు కొట్టిందా?

'మై బేబీ' చిత్రానికి నెల్సన్‌ వెంకటేసన్‌ దర్శకుడు. ఒక సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌ జీవితంలో 2014లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలు.