విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి. అయితే ఆ మూడింటికి త్రివిక్రమ్ రచయిత. ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... తాజాగా షూటింగ్ మొదలైంది.

Continues below advertisement


సెట్స్ మీదకు వెంకీ 77...
20 నెలలు తర్వాత త్రివిక్రమ్!
సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'తో విక్టరీ వెంకటేష్ తన కెరీర్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా‌‌ 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu)లో అతిథి పాత్ర చేసేందుకు అంగీకరించారు. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత సోలో హీరోగా ఆయన నటిస్తున్న సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నదే. 


అక్టోబర్ 8... బుధవారం నాడు వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 'గుంటూరు కారం' విడుదల తర్వాత సుమారు 20 నెలలు అయ్యాక త్రివిక్రమ్ మళ్ళీ కెమెరా వెనక్కి వెళ్లారు. తన దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Also Read: కళ్యాణీ ప్రియదర్శన్ గ్లామర్ ట్రీట్... బెల్లీ డ్యాన్స్‌తో షేక్ ఆడించిందంతే






వెంకటేష్ హీరోగా నటించిన 'వాసు', 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేశారు. ఇంతకు ముందు ఆయనతో రచయితగా పని చేసిన త్రివిక్రమ్ తొలిసారి దర్శకుడిగా పని చేస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హీరోగా వెంకీకి 77వది.


వెంకటేష్ హీరోయిన్ ఎవరు?
Venkatesh Trivikram Movie Heroine: వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకు ఇంకా అధికారికంగా సమాధానం రాలేదు. ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉంటుందని సమాచారం. సౌత్ క్వీన్ త్రిషతో పాటు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాలో నటించిన నిధి అగర్వాల్, రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార ఛాప్టర్ 1', ప్రస్తుతం ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో కథానాయికగా నటిస్తున్న రుక్మిణి వసంత్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎవరు ఫైనల్ అవుతారు అనేది త్వరలో తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత 'దృశ్యం 3' చేయనున్నారు వెంకటేష్.


Also Read: ఫ్లాపుల్లో ఉన్నా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గలేదు... దుల్కర్ సల్మాన్ సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?