Pooja Hegde Remuneration For Dulquer Salmaan Movie: పూజా హెగ్డే నటిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఒకప్పుడు ఉండేది. తెలుగులో ఆవిడ చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన రోజులు ఉన్నాయి. అయితే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయినట్లు డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన పూజా హెగ్డే ఖాతాలో వరుసగా ఫ్లాపులు చేరాయి. పరాజయాలు పలకరించినా సరే పూజా హెగ్డే పారితోషికం మాత్రం తగ్గలేదు. దుల్కర్ సల్మాన్ జంటగా నటిస్తున్న సినిమాకు ఆవిడ ఎంత తీసుకుంటుందో తెలుసా?
టాలీవుడ్ రీ ఎంట్రీ... పూజా హెగ్డేకు మూడు కోట్లు!పూజా హెగ్డే తెలుగు సినిమా చేసి మూడు సంవత్సరాలు అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'ఆచార్య'లో కనిపించింది. ఆ తరువాత 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో ఆవిడ కనిపించలేదు. హిందీ, తమిళ సినిమాలతో బిజీ బిజీ. మూడేళ్లలో పూజ చేసిన సినిమాలు ఏమైనా హిట్ అయ్యాయా... అంటే అది కూడా లేదు. ఆవిడను నటించినా చివరి ఆరు సినిమాలు ఫ్లాప్. అయినా సరే రెమ్యూనరేషన్ తగ్గలేదు.
Also Read: సైలెంట్‌గా వందో సినిమాకు పూజ చేసిన నాగార్జున... కింగ్ జోడీగా మహానటి!?
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి ఒక ప్రేమ కథ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్. ఆల్రెడీ ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఈ సినిమా కోసం పూజా హెగ్డే మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారట.
ఫ్లాపుల్లో ఉన్నా సరే పారితోషికం తగ్గించలేదని పూజా హెగ్డేకు తెలుగు సినిమా దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం లేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ పరిస్థితి చూస్తుంటే పూజకు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమా హిట్ అయితే ఆవిడకు మరిన్ని ఛాన్సులు వస్తాయి. 'కూలీ' రిజల్ట్ పక్కన పెడితే ఆ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ 'మోనిక' బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు పూజ హెగ్డే చేతిలో తమిళ సినిమా 'కాంచన 4', హిందీ సినిమా 'హై జవానీతో ఇష్క్ హోనా హై' ఉన్నాయి.
Also Read: లిటిల్ హార్ట్స్ తండ్రి... 90s కూతురు... Zee5లో కనబడుటలేదు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?