మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఉంటారు. కొత్త తరహా కథాంశాలతో డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడం ఆయన అలవాటు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాంఢీవధారి అర్జున' (Gandeevadhari Arjuna Movie). స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. 


నీ జతై... హీరో హీరోయిన్లపై!
Nee Jathai Song : 'గాంఢీవధారి అర్జున' సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా 'ఏజెంట్' ఫేమ్, యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య నటించారు. వీళ్ళిద్దరిపై తెరకెక్కించిన 'నీ జతై' సాంగ్ ప్రోమోను ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 31న లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నారు. 


Gandeevadhari Arjuna Movie Songs : 'గాంఢీవధారి అర్జున'కు మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. 'నీ జతై...' పాటను నకుల్ అభయంకర్, Elvya పాడారు. రెహమాన్ సాహిత్యం అందించారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రోమో చూస్తే... హీరో హీరోయిన్లు ఇద్దరు ట్రిప్ వేస్తే, ఆ నేపథ్యంలో వచ్చే పాటగా ఉంది. 


Also Read పవన్ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న ఊర్వశి రౌతేల - కానీ?



ఆగస్టు 25న సినిమా విడుదల
Gandeevadhari Arjuna Release Date : 'గాంఢీవధారి అర్జున'ను ఆగస్టు 25న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాను భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌ నిర్మిస్తున్నారు.


ఇటీవల 'గాంఢీవధారి అర్జున' టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి పెద్ద స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఆ ఎమర్జెన్సీ నుంచి కాపాడే వ్యక్తి ఎవ‌రా? అని అంద‌రూ ఆలోచిస్తుంటే... అంత హై రిస్క్ నుంచి కాపాడే ఏకైక వ్య‌క్తిగా అర్జున్ (వరుణ్ తేజ్) క‌నిపిస్తాడు. ఇంత‌కీ, ఆ ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు ఏంటి? అర్జున్ ఎవ‌రు?  త‌నేం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే... ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాను చూడాలి. 



'గాంఢీవధారి అర్జున'లో వరుణ్ తేజ్ లుక్ స్టైలిష్ గా ఉంది. ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. టీజర్, ఆ విజువల్స్ ఆకట్టుకున్నాయి. అయితే దేశానికి ఎదురైన ప్రమాదం ఏమిటనేది చెప్పకుండా సస్పెన్సులో ఉంచారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జరుగుతున్నాయి. వ‌రుణ్‌ తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.


Also Read : టాలీవుడ్‌లో విషాదం - శ్రీకాంత్, నవదీప్‌తో సినిమాలు తీసిన దర్శకుడు మృతి


వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న 'గాంఢీవధారి అర్జున' సినిమాలో నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, 'బేబీ' వేద ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు : అవినాష్ కొల్ల, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, యాక్షన్ కొరియోగ్రఫీ : లాజ్లో - వెంకట్ - విజయ్ - జుజి, ఛాయాగ్రహణం : ముఖేష్ జి, సంగీతం : మిక్కీ జె మేయర్. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial