పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం 'బ్రో'. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు జూలై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా థియేటర్స్ లో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్న సుదర్శన్ థియేటర్లో 'బ్రో' సినిమాని చూసేందుకు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ తేజ్, మూవీ యూనిట్ తో కలిసి అకిరా నందన్ సుదర్శన్ థియేటర్ కి రావడంతో అతన్ని చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
అకిరా నందన్ అలా కారు దిగగానే పవన్ ఫ్యాన్స్ అతను చుట్టుముట్టి సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. అంతేకాకుండా జూనియర్ పవర్ స్టార్, ఫ్యూచర్ పవర్ స్టార్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ తెగ సందడి చేశారు. అకిరా రాకతో సుదర్శన్ థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అటు అకీరా తల్లి రేణు దేశాయ్ కూడా నా పిల్లలు ఏ రంగంలో ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న దాని పూర్తిగా సహకరిస్తానని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అకిరా ఎంట్రీ పై ఎన్నో రకాల ఊహాగానాలు వినిపిస్తుండగా.. ప్రస్తుతం అతను చదువుపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తన తండ్రి పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని అకిరా కొనసాగిస్తాడని ఫాన్స్ నమ్ముతున్నారు. అందుకే అకిరా ఆరంగేట్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు అకిరా నందన్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటూనే నటనలోనూ శిక్షణ పొందుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో అఖీరా నందన్ ఆరంగేట్రం పై గుడ్ న్యూస్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక అకిరా నందన్ ప్రస్తుతం తన తల్లి రేణు దేశాయ్ తోనే ఉంటున్నాడు. ప్రస్తుతం పూణేలో తన చదువును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్రో ఈ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఆకట్టుకునే తారాగణం ఉంది.
పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ల సరసన ప్రియా ప్రకాష్ వారియర్ కేతిక శర్మ హీరోయిన్స్ గా నటించగా.. కమెడియన్ బ్రహ్మానందం, సీనియర్ నటి రోహిణి, వెన్నెల కిషోర్, అలీ రెజా, రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందించిన ఈ సినిమా తమిళంలో వచ్చిన 'వినోదయ సీతం' అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా రూపొందింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రీమేకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. జీ స్టూడియో సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : 'భోళా శంకర్' కి రెమ్యునరేషన్ వద్దన్న చిరంజీవి - దానికి బదులుగా నిర్మాతలతో భారీ ఒప్పందం!