Ghani movie gets new release date: వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన సినిమా 'గని' (Ghani Movie). తొలుత గత ఏడాది డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఆ తేదీకి సినిమా రాలేదు. కరోనా, ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు. తర్వాత ఈ ఏడాది మార్చి 25న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అదే తేదీకి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25న లేదంటే మార్చి 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కుదరలేదు. ఎందుకంటే... ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' వచ్చింది. ఇప్పుడు ఫైనల్ అండ్ లాస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Continues below advertisement


ఏప్రిల్ 8న 'గని' సినిమాను (Ghani From April8th) విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ నేడు వెల్లడించింది. ఆ రోజు విడుదల కావడం ఖాయమే. అయితే... 'గని' వచ్చిన వారం రోజులకు, ఏప్రిల్ 14న... 'కె.జి.యఫ్ 2' విడుదల కానుంది. అందువల్ల, బాక్సాఫీస్ దగ్గర సినిమాకు పోటీ ఎదురు కానుంది.


Also Read: మెగాహీరో కోసం పాట పాడిన శంకర్ కూతురు


కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ 'గని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) కథానాయిక. ప్రత్యేక గీతం 'కొడితే...'లో తమన్నా డాన్స్ చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటించారు. 


Also Read: బాక్సాఫీస్ బరిలో 'ఆచార్య' - 'ఎఫ్ 3' మధ్య క్లాష్ తప్పింది! ఓ నెల వెనక్కి వెళ్ళిన వెంకటేష్ - వరుణ్ తేజ్ సినిమా