కమల్ హాసన్ 'విక్రమ్' షూటింగ్ 110 రోజుల్లో కంప్లీట్ అయ్యింది. రీసెంట్ టైమ్‌లో ఇదొక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే... సినిమాలో కమల్ హాసన్ ఒక్కరే కాదు, ఆయనతో పాటు విజయ్ సేతుపతి, 'పుష్ప: ద రాజ్'లో పోలీస్ అధికారి పాత్రలో నటించిన మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా ఉన్నారు. ముగ్గురు స్టార్స్, భారీ కాస్టింగ్‌తో కూడిన ఈ సినిమా చిత్రీకరణను 110 రోజుల్లో ఫినిష్ చేయడం విశేషమే. ఇకపై 'విక్రమ్' సెట్స్‌కు కమల్ హాసన్ వెళ్లాల్సిన పని లేకపోవడంతో ఈ వీకెండ్ 'బిగ్ బాస్ అల్టిమేట్'కు ఆయన వస్తారని ఆశించవచ్చు.
'విక్రమ్' షూటింగ్ కంప్లీట్ అయినట్టు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపారు. ఫహద్ ఫాజిల్ గన్ ఫైరింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్తీ 'ఖైదీ', విజయ్ 'మాస్టర్' సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని టాక్. కరోనా వల్ల షూటింగ్ కొంత ఆలస్యం అయ్యింది. లేదంటే ఇంకా ముందే ఫినిష్ అయ్యేదని, భారీ స్టార్ కాస్ట్ సినిమాలను తక్కువ రోజుల్లో ఫినిష్ చేయడం వల్ల నిర్మాతకు ఖర్చు తగ్గుతుందని ఇండస్ట్రీ టాక్.
Also Read: తమిళ ‘బిగ్ బాస్’కు కమలహాసన్ షాక్ - ఓటీటీ వెర్షన్‌లో ఇంక!
తమిళ 'బిగ్ బాస్'కు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫైవ్ సీజన్స్ చేశారు. అయితే... ఇటీవల ఈ రియాలిటీ షో నుంచి ఆయన తప్పుకొంటుంటున్న వార్తలు వచ్చాయి. దాంతో ఆయన స్పందించారు. 'విక్రమ్' సినిమా షెడ్యూల్స్, 'బిగ్ బాస్ అల్టిమేట్' షెడ్యూల్ క్లాష్ కావడంతో... రెండూ మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉండటంతో తమిళ 'బిగ్ బాస్' ఓటీటీ షోకు దూరంగా ఉన్నారు. 'బిగ్ బాస్ 6' హోస్ట్ చేస్తానని కమల్ హాసన్ చెప్పారు. ఇప్పుడు 'విక్రమ్' షూటింగ్ కంప్లీట్ కావడంతో 'బిగ్ బాస్ అల్టిమేట్'కు ఏమైనా వస్తారేమో చూడాలి.
Also Read: కోటి రూపాయల కారు కొన్న 'బిగ్ బాస్ 5' బ్యూటీ