'క్రాక్', 'వీర సింహా రెడ్డి' సినిమాల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ విలనిజం చూశారు. 'కోట బొమ్మాళీ పీఎస్'లో పోలీస్ ఉన్నతాధికారిగా ఆమె బాసిజం చూశారు. 'యశోద'లో అందం, డబ్బుపై ఆశ ఉన్న మహిళగా మోడ్రన్ విలనిజం చూపించారు. 'హను-మాన్' సినిమాలో అక్కగా కనిపించి మెప్పించారు. మరి, వరలక్ష్మీ శరత్ కుమార్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా? అయితే... 'శబరి' సినిమాలో 'నా చెయ్యి పట్టుకోవే' సాంగ్ చూడాలి.
'శబరి' కోసం నివేక్షతో వరలక్ష్మి డ్యాన్స్!
వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) తల్లి పాత్రలో నటించిన సినిమా 'శబరి' (Sabari Movie). మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ప్రొడ్యూస్ చేశారు. మహర్షి కూండ్ల సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. మే 3న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. నేడు 'నా చెయ్యి పట్టుకోవే...' పాట విడుదల చేశారు.
ఐదు భాషల్లో 'శబరి' సాంగ్ విడుదల!
Varalaxmi Sarathkumar's Sabari release date: మే 3న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో 'శబరి' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ వెల్లడించారు. శబరి పాటను సైతం ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే... వరలక్ష్మి డ్యాన్స్ చేయడం!
Also Read: రాజశేఖర్ కొత్త సినిమా - ప్రభాస్ కజిన్ నిర్మాణంలో...
తన బిడ్డ కోసం ఓ తల్లి ఎంత తపన పడుతుంది? చిన్నారి కోసం తల్లి ఎంత దూరం వెళుతుంది? అనే కథాంశంతో 'శబరి' సినిమా రూపొందుతోంది. తల్లిగా, తెలుగులో తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు వరలక్ష్మి. ఇందులో ఆమె కుమార్తె పాత్రలో 'బేబీ' నివేక్ష నటించారు. వాళ్లిద్దరిపై 'నా చెయ్యి పట్టుకోవే...'ను చిత్రీకరణ చేశారు. కొడైకెనాల్ ఏరియాలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశారు. నివేక్షతో కలిసి వరలక్ష్మి డ్యాన్స్ చేయడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
Also Read: విశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!
'శబరి' నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ... ''వరలక్ష్మి గారు ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రను ఈ 'శబరి'లో చేశారు. తల్లిగా ఆమె అద్భుతమైన నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. తల్లీ కూతుళ్ల మధ్య సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. గోపీసుందర్ గారు 'నా చెయ్యి పట్టుకోవే...' పాటకు మంచి బాణీ అందించారు. రెహమాన్ అంతే అందంగా తల్లీ బిడ్డల మధ్య ప్రేమను ఆవిష్కరించారు. ఈ పాటను అమృతా సురేష్ పాడారు. 'శబరి మ్యూజిక్' ఛానల్ ద్వారా విడుదల చేశాం. యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ డాటర్ లవ్... అన్నీ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.
Also Read: సత్యభామ... క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
వరలక్ష్మీ శరత్ కుమార్, 'బేబీ' నివేక్షతో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, 'మైమ్' గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, హర్ష చెముడు, ప్రభు, భద్రమ్, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి (బాహుబలి - యాత్ర ఫేమ్), హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ కృతిక ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్ - మిట్టపల్లి సురేందర్, ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ - నాని చమిడిశెట్టి, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: అనిల్ కాట్జ్.