ప్రజెంట్ 'విశ్వంభర' చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చాలా బిజీగా ఉన్నారు. తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబును ఆ సినిమా సెట్స్‌లోనే కలిశారు. డై హార్డ్ మెగా ఫ్యాన్ కార్తికేయ హీరోగా నటించిన 'భజే వాయు వేగం' టీజర్ కూడా ఆ సినిమా లొకేషన్‌లో విడుదల చేశారు. చిరు ఇష్టదైవం, రామభక్తుడు హనుమంతుని విగ్రహం నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. 'విశ్వంభర' చిత్రీకరణకు వెళ్లిన సినీ ప్రముఖులు, యూనిట్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం... మెగాస్టార్ కెరీర్ బెస్ట్ ఫైట్స్ ఈ సినిమాలో చూడొచ్చట.
చిరు కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్!
ప్రజెంట్ చిరంజీవి మీద తీస్తున్న 'విశ్వంభర' యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ ముందు వస్తుందని తెలిసింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మెగాస్టార్ కెరీర్ బెస్ట్ అని తెలిసింది. 'విశ్వంభర' సినిమాలో ఆంజనేయ స్వామి విగ్రహం కీలక పాత్ర పోషిస్తుందట. మెగా అభిమానులకు ఫుల్ ఖుషి ఇచ్చే అంశమే ఇది.
Also Read: కల్కి రిలీజ్ జూన్‌లో... ఆ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీన ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ సినిమా?
సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'విశ్వంభర' (Vishwambhara Movie) చిత్రానికి వశిష్ఠ మల్లిడి దర్శకుడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'బింబిసార' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: తమిళంలో 'యానిమల్'కు రోలెక్స్ సూర్య అయితే బెస్ట్ - 'యానిమల్ పార్క్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
'విశ్వంభర' సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్, కథతో పాటు యాక్షన్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయని తెలిసింది. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు కొంత మంది ఫైటర్లపై స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా కోసం టోటల్ 18 సెట్స్ వేశారని టాక్.
చిరంజీవి సరసన ఈ సినిమాలో త్రిష నటిస్తున్నారు. 'స్టాలిన్' విడుదలైన 18 ఏళ్లకు మళ్లీ ఈ జంట సినిమా చేస్తున్నారు. ఇంకా చిరు చెల్లెళ్లుగా 'ఎక్స్ ప్రెస్ రాజా', 'రఘువరన్ బీటెక్', 'జెంటిల్ మన్' ఫేమ్ సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుశ్మితా కొణిదెల, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్: శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి.