My Fault Movie Explained In Telugu: అన్నా చెల్లెలు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. సవతి తల్లి అయినా, రెండో నాన్న అయినా, ఆ బంధంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, సవతి తల్లి కూతురితో ఓ యువకుడు ప్రేమలో పడితే? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నిజ జీవితంలో జరిగిన ఘటన షీనా బోరా హత్య కేసు. ఇందులోనూ సవతి తల్లి కూతురితో ఓ యువకుడు ప్రేమలో పడతాడు. ఈ విషయంలో ఆమె తల్లికి తెలియడంతో వద్దని వారిస్తుంది. కానీ, ఆమె ఒప్పుకోకపోవడంతో ఏకంగా ఈ భూమ్మీదే లేకుండా చేస్తుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, షీనా బోరా తల్లి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి, ఈ మధ్యే బయటకు వచ్చింది. ‘మై ఫాల్ట్’ అనే స్పానిష్ సినిమా కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. కానీ, ఇందులో కిరాతకమైన హత్యలు మాత్రం లేవు. 2023లో విడుదలైన ఈ రొమాంటిక్ చిత్రానికి డొమింగో గొంజాలెజ్ దర్శకత్వం వహించారు. నికోల్ వాలెస్, గాబ్రియేల్ గువేరా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ‘వాట్‌ ప్యాడ్’ కథ ఆధారంగా రూపొందించారు. 


ఇంతకీ ‘మై ఫాల్ట్’ కథ ఏంటంటే?


నోహ్(నికోల్ వాలెస్) అనే యువతి తల్లి రాఫెల్లా(మార్తా హజాస్), విలియం లీస్టర్(ఇవాన్ సాంచెజ్)అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంటుంది. తన సొంత ఊరి నుంచి రాఫెల్లా విలియం దగ్గరికి వెళ్తుంది. నోహ్ తన తల్లితో పాటు వెళ్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డాన్, తన బెస్ట్ ఫ్రెండ్  బెట్టీని కూడా విడిచి వెళ్తుంది. విలియం చాలా ధనవంతుడు. చాలా పెద్ద భవనంలో నివాసం ఉంటాడు. నోహ్, రాఫెల్లా అక్కడికి వెళ్లగానే విలియం సాదర స్వాగతం పలుకుతాడు. వారికి తన విశాలమైన ఇంటిని చూపిస్తాడు. నోహ్ ఉండాల్సిన గదిని కూడా చూపిస్తాడు. దాని పక్కనే తన కొడుకు నిక్(గాబ్రియేల్ గువేరా) గది కూడా ఉందని చెప్తాడు. అప్పటికి అతడు నిద్రపోతూ ఉంటాడు. నిక్ సర్ఫింగ్ ఛాంపియన్, లా కూడా చదువుతున్నాడు. రాఫెల్లా, నోహ్ తో పాటు విలియం, నిక్ ఒకరినొకరు తెలుసుకునేందుకు డిన్నర్ కు వెళ్తారు. ఎందుకో వీరిద్దరు మొదటి నుంచి టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుతారు.


డిన్నర్ మధ్యలోనే తనకు పని ఉందని చెప్పి నిక్ బయల్దేరుతాడు. నోహ్ కూడా తనకు వేరే పని ఉందని చెప్తుంది. విలియం, రాఫెల్లా కలిసి నిక్‌ను.. నోహ్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్తారు. సరే అని కారుతో తీసుకెళ్తాడు. ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. మధ్యలోనే ఆమెను రోడ్డు మీద వదిలేసి వెళ్తాడు. ఆ కారు వెనుకాలే వస్తున్న నిక్ ఫ్రెండ్ మారియో ఆమెను నిక్ వెళ్లిన పార్టీ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే, నిక్ చాలా మంది అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేయడాన్ని చూస్తుంది. పార్టీలో రోనీ అనే క్రిమినల్ ఫ్రెండ్ టిపో నోహ్ కి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇస్తాడు. కానీ, నిక్ దాన్ని గమనించి ఆమెను అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు. నడవలేని స్థితిలో ఉన్న నోహ్ ను నిక్ బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు.


మరుసటి రోజు నిక్ కారు రేసింగ్ కు వెళ్తాడు. అక్కడికి నోహ్ కూడా వెళ్తుంది. అక్కడ జరిగిన రేస్ లో నిక్ విజయం సాధిస్తాడు. అదే సమయంలో నోహ్ తన బాయ్ ఫ్రెండ్ డాన్, ఆమె బెస్ట్ ఫ్రెండ్ బెట్టీని ముద్దు పెట్టుకున్న ఒక ఫోటోను పంపిస్తాడు. అదే సమయంలో ఆమె నిక్ ను ముద్దు పెట్టుకుంటూ ఫోటో తీసి తనకు పంపిస్తుంది. అదే సమయంలో నోహ్ ను కారులో ఉంచి నిక్ వేరొకరిని పంపించడానికి వెళ్తాడు. కానీ, నోహ్ కారు స్టార్ట్ చేస్తుంది. అయితే, కారు స్టార్టింగ్ లైన్ లో ఉండటంతో రోనీ నోహన్ ను రేస్ లో పాల్గొనాలి ఎగతాళి చేస్తాడు. సరే అంటూ రేస్ లో పాల్గొని రోనీని ఓడిస్తుంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా నోహ్ రేసులో పాల్గొనడంతో పెనాల్టీ కింద తన కారును ఇచ్చేయాలని రోనీ నిక్ ను డిమాండ్ చేస్తాడు. నిక్ తన కారును ఇచ్చేస్తాడు. రేస్ దగ్గరి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నోహ్ ను కిస్ చేస్తాడు.  


అదే సమయంలో నోహ్ తన భాయ్ ఫ్రెండ్ దూరమై బాధపడుతున్నదేమో అని భావించి రాఫెల్లా డాన్ ను ఇంటికి తీసుకొస్తుంది. కానీ, నోహ్, నిక్ తో ఫ్రెండ్లీగా ఉంటుంది. డాన్ ను పెద్దగా పట్టించుకోదు. అటు నిక్.. రోనీతో గొడవపడి గాయాలతో ఇంటికి వస్తాడు. నిక్ ను చూసి రోహ్ ను గదిలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. అయితే, నోహ్ కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తరచుగా బెదిరింపు మెసేజ్ లు వస్తుంటాయి. అయితే, ఆ మెసేజ్ లు తన తండ్రి జోనాస్ నుంచే అని తెలుసుకుంటుంది.


జోనాస్ ఒక రేసర్. అతడి ద్వారానే రేసింగ్ నేర్చుకుంటుంది. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తన మాజీ భార్య రాఫెల్లా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కూతురు నోహ్‌నే కిడ్నాప్ చేయిస్తాడు. తనను కిడ్నాప్ చేయించింది తన తండ్రి అని తెలుసుకుని చాలా బాధపడుతుంది. నిక్ కారు జీపీఎస్ ట్రాకర్ ద్వారా నోహ్ ఎక్కడుందో కనిపెట్టి పట్టుకుంటాడు. ఆ సమయంలో జరిగిన ఫైరింగ్ లో నోహ్ తండ్రి జోనాస్ చనిపోతాడు. (ఇక్కడ వచ్చే యాక్షన్ సన్నివేశం ఆకట్టుకుంటుంది)


నోహ్ ను ఇంటికి తీసుకొస్తాడు. ఆ రాత్రి ఇద్దరు కలిసి ఒకే గదిలో ఇంటిమేట్ అవుతారు. ఈ విషయం విలియంకు తెలుస్తుంది. కానీ, ఆమె తోడుగా పడుకున్నట్లు అబద్దం చెప్తాడు. అయితే, నిక్, నోహ్ తమ మధ్య ఉన్న సంబధానికి చెక్ పెట్టాలి అనుకుంటారు. చివరగా ఓసారి ఇంటిమేట్ అవుదామని బీచ్ కు వెళ్తారు. అక్కడ రాత్రంతా శృంగారంలో పాల్గొంటారు. ఆ తర్వాత కూడా వీరి మధ్య ఆ సంబంధం కొనసాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాఫెల్లా ఎలాగైనా వీరి మధ్య ప్రేమకు ఫుల్ స్టాఫ్ పెట్టించాలని భావిస్తుంది. అక్కడితో సినిమా అయిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.


Read Also: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ


My Fault Trailer: