Animal 2: 'యానిమల్'కు రోలెక్స్ బెస్ట్ - 'యానిమల్ 2' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga On Animal 2 shoot: యానిమల్ సక్సెస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ నంబర్స్ మాట్లాడతాయి. ఆ సినిమా సీక్వెల్ 'యానిమల్ 2' షూట్ గురించి సందీప్ అప్డేట్ ఇచ్చారు.

Continues below advertisement

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన 'యానిమల్' (Animal Movie), ఆ సినిమా సాధించిన సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ నంబర్స్, కలెక్షన్స్ సినిమా విజయం గురించి చెబుతాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంతో పాటు రణబీర్ కపూర్ నటనపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. కోలీవుడ్ హీరోల్లో ఎవరైతే 'యానిమల్' పాత్రకు బావుంటుంది? అని అడిగితే సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో తెలుసా?

Continues below advertisement

'యానిమల్'గా రోలెక్స్ సూర్య నటిస్తే?
చెన్నైలో జరిగిన ఓ అవార్డుల వేడుకకు సందీప్ రెడ్డి వంగా అటెండ్ అయ్యారు. ఆ వేడుకలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ తమిళంలో 'యానిమల్' తీయాల్సి వస్తే ఏ హీరోతో తీస్తారు? ఆ పాత్రకు ఎవరైతే బావుంటారు? అని! అప్పుడు సూర్య పేరు చెప్పారు సందీప్ రెడ్డి వంగా.

యానిమల్ తరహా క్యారెక్టర్ ఆల్రెడీ సూర్య ఒకటి చేశారు. స్క్రీన్ మీద కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ... లోక నాయకుడు 'విక్రమ్' సినిమాలోని ఆయన రోలెక్స్ క్యారెక్టర్ ఎంత హిట్ అయ్యిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. 'యానిమల్' విడుదల అయ్యాక అందులో రణబీర్ నటనను, రోలెక్స్ పాత్రలో సూర్య నటనను సోషల్ మీడియాలో కొందరు కంపేర్ చేశారు కూడా! ఇప్పుడు సూర్య పేరును సందీప్ రెడ్డి వంగా చెప్పిన నేపథ్యంలో వాళ్లిద్దరి కలయికలో ఓ సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Also Read: చిరంజీవి మద్దతు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికే - ఓపెన్‌గా చెప్పిన మెగాస్టార్!


2026లో సెట్స్ మీదకు 'యానిమల్ పార్క్'
Director Sandeep Reddy Vanga says 'Animal Park' shoot will begin in 2026: ఈ ఏడాది కూడా 'యానిమల్' గురించి డిస్కస్ జరుగుతుందంటే సందీప్ రెడ్డి వంగా తీసిన విధానం. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. 'యానిమల్' ఎండింగ్‌లో సీక్వెల్ 'యానిమల్ పార్క్' తీయనున్నట్లు ప్రకటించారు.

Also Readబాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ

'యానిమల్ 2' (Animal 2) చిత్రాన్ని 2026లో సెట్స్ మీదకు తీసుకు వెళ్లాడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సందీప్ రెడ్డి వంగా చెప్పారు. తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్', 'యానిమల్' సినిమాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. దాంతో ఆయన తీయబోయే సినిమా మీద అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మరొక సినిమా చేయడానికి సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నారు. మరి ముందుగా ఎవరి సినిమా స్టార్ట్ అవుతుందనేది చూడాలి. ఈలోపు 'యానిమల్' మీద వచ్చిన, వస్తున్న విమర్శలకు సందీప్ రెడ్డి వంగా ఘాటుగా బదులు ఇస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!

Continues below advertisement