తెలుగు ప్రేక్షకులు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను ముద్దుగా చందమామ  అని పిలుస్తారు. కానీ, ఇప్పుడు ఆవిడకు 'గూఢచారి', 'మేజర్' చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క కొత్త ట్యాగ్ ఇచ్చారు. అది ఏమిటో తెలుసా? క్వీన్ ఆఫ్ మాసెస్. ఆ బిరుదు ఇవ్వడమే కాదు... ఇప్పటి వరకు ఆమెను ప్రేక్షకులు చూడని కొత్త అవతారంలో చూపిస్తున్నారు.


'సత్యభామ'గా కాజల్... ఫుల్ యాక్షన్!
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా శశికిరణ్ తిక్క సమర్పణలో రూపొందుతున్న సినిమా 'సత్యభామ' (Satyabhama Movie 2024). ఇందులో యువ హీరో నవీన్ చంద్ర ఆమెకు పెయిర్. ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) ఈ సినిమాతో చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టారు. ఆయన సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 


మే 17న థియేటర్లలోకి 'సత్యభామ'
Satyabhama Movie Release Date: మే 17న 'సత్యభామ' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఇన్నోవేటివ్‌గా ఉంది. క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన వస్తువుల నుంచి తుపాకీలోని విడివిడి భాగాలను కాజల్ అగర్వాల్ తీసుకుని లోడ్ చేసి, ఆ తర్వాత గురి చూసి షూట్ చేయగా... క్యాలెండర్‌లో మే 17వ తేదీ నుంచి బుల్లెట్ దూసుకు వెళ్లింది.


Also Readరాజశేఖర్ కొత్త సినిమా - ప్రభాస్ కజిన్ నిర్మాణంలో...






ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ చాలా సినిమాలు చేశారు. కమర్షియల్ సినిమాల్లో కనిపించారు. అయితే... ఈ రేంజ్ మాస్ రోల్ ఎప్పుడు చేయలేదని, యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆమె రోల్ ఉంటుందని సమాచారం. ఆల్రెడీ విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమాకు బజ్ తెచ్చింది.


Also Readవిశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!



హత్యకు గురైన అమ్మాయి ప్రాణాలు కాపాడాలని సత్యభామ ప్రయత్నించినా సరే... ఎటువంటి ఫలితం ఉండదు. ఆ అమ్మాయి మరణంతో కేసును సత్యభామ నుంచి మరొకరికి బదిలీ చేస్తారు ఉన్నతాధికారులు. 'ఈ కేసు నీ చేతుల్లో లేదు' అని ప్రకాష్ రాజ్ చెబుతారు. అమ్మాయి మరణం సత్యభామను డిస్టర్బ్ చేస్తుంది. ఆమెను హత్య చేసిన వాళ్లను పట్టుకోవాలని ట్రై చేస్తుంది. ఆ ప్రయత్నంలో సత్యభామ సక్సెస్ అయ్యిందా? లేదా? ఆవిడ ప్రయాణంలో ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Read: ఈవారం థియేటర్లు, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు - ఒక్కొక్కటి ఒక్కో జోనర్



కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్, కథనం - సమర్పణ: శశి కిరణ్ తిక్క, నిర్మాతలు: బాబీ తిక్క - శ్రీనివాసరావు తక్కలపెల్లి, సహ నిర్మాత: బాలాజీ, ఛాయాగ్రహణం: జి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: సుమన్ చిక్కాల.