పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ సినిమాకు వంశీ పైడిపల్లికి సంబంధం ఏమిటి? 'జెజిఎమ్' (జన గణ మణ) సినిమా పోస్టర్ విడుదలైన తర్వాత చాలా మంది తెలుగు ప్రేక్షకుల్లో కలిగిన సందేహం ఇది. ఎందుకంటే... పోస్టర్ మీద వంశీ పైడిపల్లి పేరు ఉంది. సాధారణంగా తన సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు పూరి జగన్నాథ్ రాసుకుంటారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా పోస్టర్ మీద మరో దర్శకుడి పేరు ఉండటంతో కొంత మంది క‌న్‌ఫ్యూజ్‌ అయ్యారు.

 

'జెజిఎమ్' పోస్టర్ మీద వంశీ పైడిపల్లి పేరు ఎందుకు ఉంది? అంటే... ఈ సినిమాతో వంశీ పైడిపల్లి నిర్మాతగా మారుతున్నారు (Vamshi Paidipally Turns Producer with JGM Movie). అవును... 'జన గణ మణ' సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్ గ్రూప్, 'JGM Movie'తో సినిమా నిర్మాణంలో అడుగు పెడుతోంది. శ్రీకర స్టూడియోస్ సంస్థను స్థాపించి వంశీ పైడిపల్లి నిర్మాతగా సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పూరి కనెక్ట్స్ సంస్థతో కలిసి 'Jana Gana Mana'ను ప్రొడ్యూస్ చేస్తోంది.

 


 

'JGM Movie'కి శ్రీకర స్టూడియోస్ తరపున వంశీ పైడిపల్లి, పూరి కనెక్ట్స్ తరపున ఛార్మీ కౌర్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రతి భారతీయుడి గుండెలను హత్తుకునేలా 'జెజిఎమ్' సినిమా ఉంటుందని వంశీ పైడిపల్లి తెలిపారు. ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో మై గ్రూప్ జూపల్లి రాము రావు, శ్రీకర స్టూడియోస్ డైరెక్టర్ సింగరావు పాల్గొన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 3న విడుదల చేయనున్నారు.