''ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలై పోద్ది' - 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ (Ustaad Bhagat Singh Movie)లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. ఈ సినిమా దర్శకుడు, ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ మరోసారి ఆ మాట చెప్పారు. పవన్ పెర్ఫార్మన్స్ మామూలుగా ఉండదని ట్వీట్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే... 


పవన్ 'ఉస్తాద్' లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి
Ustaad Bhagat Singh Schedule Wrap : పవన్ కళ్యాణ్ పాల్గొనగా... 'ఉస్తాద్ భగత్ సింగ్' లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి చేశామని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో పవన్ పెర్ఫార్మన్స్ మామూలుగా లేదని సినిమాపై అంచనాలు పెంచారు. 


Also Read : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?






పదేళ్ళ క్రితం 'గబ్బర్ సింగ్'
ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'
పవన్ కళ్యాణ్ హీరోగా ఇంతకు ముందు హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' తీశారు. పదేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' ఇంటర్వెల్ సీన్ జనవరి 17, 2012లో షూటింగ్ చూస్తే... సెప్టెంబర్ 27, 2023లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంటర్వెల్ తీసినట్లు తెలిపారు.


Also Read నానితో మరోసారి - తమిళమ్మాయికి మరో తెలుగు సినిమా!





'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల ఓ కథానాయిక. మరో కథానాయికగా అఖిల్ అక్కినేని 'ఏజెంట్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాల ఫేమ్ సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 



వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ హరీష్ శంకర్ ఓ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ కింద ''ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ 50 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది అంట కదా అన్నా! ఇంక క్వాలిటీ ఆ? ఆ దేవుడి మీదే భారం వేశాం'' అని రిప్లై ఇచ్చాడు. అతడికి హరీష్ శంకర్ ''అంతే కదా తమ్ముడు! అంతకు మించి నువ్వు ఏం చేయగలవు చెప్పు? ఈలోగా కాస్త స్టడీస్, జాబ్, కెరీర్ మీద ఫోకస్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు. ఆల్ ది బెస్ట్'' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


'ఉస్తాద్ భగత్ సింగ్' కాకుండా సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ', క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా చేయాల్సి ఉంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial