ఊర్మిళ మటోండ్కర్ (Urmila Matondkar)... తెలుగు ప్రేక్షకులకు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కథానాయకగా తెలుసు.‌ కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా వర్మ తీసిన 'అంతం' సినిమాతో ఆవిడ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే, ఆ సినిమా కంటే ముందు హిందీలో బాలనటిగా, కథానాయికగా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే... విడుదల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. దాంతో ఊర్మిళ పేరు వార్తల్లోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే...


నాలుగు నెలల క్రితమే కోర్టుకు వెళ్లిన ఊర్మిళ
Urmila Matondkar Divorce: ఊర్మిళ మటోండ్కర్ నాలుగు నెలల క్రితం విడాకుల కావాలంటూ కోర్టుకు వెళ్లినట్టు ముంబై వర్గాలు తెలిపాయి. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని, భర్త నుంచి తనకు విడాకులు కావాలని ఆవిడ కోర్టుకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, వైవాహిక బంధం నుంచి ఆవిడ ఎందుకు వేరు పడాలని అనుకుంటున్నారు? అనే అంశం ఇంకా బయటకు రాలేదు. 


ఊర్మిళ భర్త పేరేమిటి? ఎవరీ మోసిన్ అక్తర్ మీర్?
Urmila Matondkar Husband Name: ఊర్మిళ మటోండ్కర్ జీవితం ఓపెన్ బుక్ అని చెప్పవచ్చు. తెలుగులో 'అంతం', 'గాయం', 'అనగనగా ఒక రోజు' సినిమాలు చేశారు. అలాగే, 'మనీ మనీ' సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా! అయితే... 'రంగీలా' సినిమా ఆమెకు బోలెడు పేరు తెచ్చింది. సూపర్ హిట్ సినిమాలు ఎన్నో చేసిన ఊర్మిళ... ఫిబ్రవరి 4. 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త పేరు మోసిన్ అక్తర్ మీర్. ఆమె వయసు 50 ఏళ్లు కాగా... అతని వయసు 40 ఏళ్లే.


Also Readఎన్టీఆర్ ఎగ్జైట్‌మెంట్‌తో నెక్ట్స్ లెవల్‌కు... మనోళ్లకు అంత టైమ్ ఇస్తే అద్భుతాలే - కొరటాల శివ ఇంటర్వ్యూ






ఊర్మిళ మటోండ్కర్, మోసిన్ అక్తర్ మీర్ వివాహం అప్పట్లో హిందీ సినిమా వర్గాల్లో చర్చకు కారణం అయ్యింది. వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన వ్యక్తిని ఊర్మిళ పెళ్లి చేసుకున్నారు. మోసిన్ అక్తర్ మీర్ కశ్మీరీ వ్యాపారవేత్త.






ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బంధువుల పెళ్లిలో ఊర్మిళ మటోండ్కర్, మోసిన్ అక్తర్ మీర్ తొలిసారి ఒకరికొకరు పరిచయం అయ్యారు. 2104లో పరిచయం అయితే ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. రెండేళ్ల ప్రేమ తర్వాత అమృత్ సర్ స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్)కు వెళ్లి ఆ తర్వాత అతి కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహానికి హాజరైన వ్యక్తుల్లో మనోహ్ మల్హోత్రా సైతం ఉన్నారు.


Also Readచిరుతో విబేధాలు లేవు... 'ఆచార్య' తర్వాత మెగా మెసేజ్... పుకార్లకు చెక్ పెట్టిన కొరటాల



మోసిన్ అక్తర్ మీర్ మోడల్ కూడా. 'లక్ బై ఛాన్స్'తో పాటు కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పుడు వ్యాపారం మీద దృష్టి పెట్టారని సమాచారం. అయితే... ఊర్మిళ గానీ, మోసిన్ గానీ విడాకుల విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. త్వరలో రీ ఎంట్రీకి ఊర్మిళ రెడీ అవుతున్నారు.