మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)ది సూపర్ హిట్ కాంబినేషన్. రచయితగా 'బృందావనం', దర్శకుడిగా 'జనతా గ్యారేజ్'... ఎన్టీఆర్‌తో కొరటాల చేసిన రెండూ బ్లాక్ బస్టర్లే. 'దేవర' (Devara Movie) హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 27న) సినిమా విడుదల సందర్భంగా కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు...


విడుదల తేదీ దగ్గర పడుతోంది. మీ టెన్షన్ తగ్గుతుందా? పెరుగుతోందా?
కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎప్పుడూ ఉండే ఫీలింగ్ ఇప్పుడూ ఉంది. ఆ నెర్వస్ కొంచెం ఉంది.


భయాన్ని నెగెటివ్ సెన్స్, ధైర్యాన్ని పాజిటివ్ సెన్స్ లో వాడతాం. మీరు ఆ రెండిటినీ ఫ్లిప్ చేసినట్టు ఉంది. కథలో ఎలా చెప్పారు?
మనిషికి ధైర్యం అవసరం. మనకు ఆ విషయం తెలుసు. అయితే, మితిమీరిన ధైర్యం మంచిది కాదు. అది మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో ఉంటుంది. దాన్ని గౌరవించాలని చెబుతున్నాం. భయం ఉండకూడదు అనేది తప్పు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎందుకు ఆగుతాం? మనలో చిన్నపాటి భయం ఉండటం వల్ల. భయం అవసరం. మనిషికి అది చాలా మంచిది కూడా! పాజిటివ్ వేలో చెబితే... ఆ భయాన్ని జవాబుదారీ తనం అని చెప్పవచ్చు.


'దేవర' కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ ఏమన్నారు? ఆయన ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు?
ఆయన (ఎన్టీఆర్)తో నా ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన రియాక్షన్ చాలా బలంగా ఉంటుంది. డిప్లమసీ ఉండదు. 'మామూలుగా లేదు. భలే ఉంది' అని అంటారు. బాగోపోయినా అంతే! అందువల్ల, నాకు తెలుస్తుంది. ఐడియా స్టేజిలో ఆయన ఎగ్జైట్ అయ్యారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఎగ్జైట్మెంట్ వల్ల నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లా. 


తండ్రి పాత్ర వేరేవాళ్లు అనుకుని రాసుకున్నారా? ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని రాశారా?
వేరేవాళ్లు అనుకోలేదు. 'దేవర' కీ క్యారెక్టర్ అయినప్పుడు వేరేవాళ్లను ఎందుకు అనుకుంటా? వర క్యారెక్టర్ కూడా కీలకమైన పాత్ర. అది రెండో పార్టులో మరింత కీ క్యారెక్టర్ అవుతుంది. 


మీ ప్రతి సినిమాలో హీరోకి ఓ ఐడియాలజీ ఉంటుంది. ముందు హీరో క్యారెక్టర్ రాసి ఆ ఐడియాలజీ రాస్తారా? లేదంటే రెండూ కలిపి రాస్తారా?
కథ రాయడం మొదలు పెట్టినప్పుడు హీరోయిజం, ఆ క్యారెక్టరైజేషన్ ఐడియాలజీ కలిపి రాస్తాను. ఆ రెండూ బ్లెండ్ చేస్తూ సన్నివేశాలు రాస్తాను. ఈ సినిమాలో భయం అనేది అవసరం అని చెప్పా. తీసుకుంటే అదొక సందేశం. లేదంటే కమర్షియల్ యాక్షన్ సినిమా. 


'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది. అప్పుడు మార్పులు ఏమైనా చేశారా?
ఎన్టీఆర్ గారు ఎప్పుడూ సూపర్ స్టార్. బిగ్గెస్ట్ మాస్ హీరో. 'ఆర్ఆర్ఆర్'కు ముందు ఆయన తక్కువ హీరో కాదు కదా! ఆయనకు ఇటువంటి కథ రాస్తాం. లక్కీగా నా అనుకున్న కథలో పెద్ద స్కేల్ ఉంది. బోర్డర్స్ దాటే పొటెన్షియల్ ఉంది. నేను ఇంతకు ముందు రాసిన కథల కంటే ఇది పెద్ద కథ.


'దేవర'ను ఒక్క పార్టులో చెప్పలేం. రెండో పార్ట్ కావాలని ఏ స్టేజిలో అనుకున్నారు?
ఎన్టీఆర్ గారికి నేను నాలుగు గంటల పాటు కథ చెప్పా. పేపర్ మీద పెట్టినప్పుడు ఆరేడు గంటలు వస్తుంది. ఒక్క సినిమాలో చెప్పగలమా? అనే సందేహం ఉంది. అయితే, రెండు పార్ట్స్ వద్దనుకుని సినిమా మొదలుపెట్టాం. రెండో షెడ్యూల్ వచ్చేసరికి మనకు అర్థమైంది. అప్పుడు రెండో పార్ట్ అనౌన్స్ చేశాం. బిజినెస్ లేదా సెన్సేషన్ కోసం 'దేవర 2' అనౌన్స్ చేయలేదు.


'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' సెట్స్ మీదకు వెళ్లడానికి పట్టింది. ఎప్పుడు ఏం జరిగింది?
స్కిప్ట్ అండీ. ఈ కథను తెరకెక్కించడానికి కొంత ప్రిపరేషన్ అవసరం అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్టు చేశాం. సముద్రం మీద ఎలా షూటింగ్ తీయాలి?  మనమే ఒక సముద్రం క్రియేట్ చేసి ఎలా చేయాలి? లైటింగ్ ఎలా ఉండాలి? కలర్ వేరియేషన్స్ ఎలా ఉండాలి? అనే అంశాల మీద ఆరు నెలలు వర్క్ చేశాం.


'దేవర' కోసం తొలిసారి మీరు హాలీవుడ్ టెక్నీషియన్లతో పని చేశారు. వాళ్లకు, మన టెక్నీషియన్లకు డిఫరెన్స్ ఏంటి? 
వాళ్ళకు ప్రిపరేషన్ వర్క్ చాలా అవసరం. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాలి. ఆ విషయంలో మన టెక్నీషియన్లు చాలా అడ్వాన్స్డ్. మనవాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ ప్రిపరేషన్ లేకుండా షూటింగ్ చేయడానికి వెళ్లినా సరే బాగా ఎగ్జిక్యూట్ చేయగలరు. హాలీవుడ్ వాళ్ళు పానిక్ అవుతారు. మనవాళ్ళకు లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఉన్నా చేయడం అలవాటు. అంత ప్రిపరేషన్ టైం గనుక మనకు ఇస్తే ఇంకా పెద్దగా తీయగలం.


Also Read: చిరుతో విబేధాలు లేవు... 'ఆచార్య' తర్వాత మెగా మెసేజ్... పుకార్లకు చెక్ పెట్టిన కొరటాల



'ఆచార్య'కు ముందు అనుకున్న కథ. ఆ సినిమా విడుదలైన తర్వాత ఒత్తిడి ఏమైనా ఉందా?
ఏం లేదు అండీ. 'ఆచార్య' విడుదలైన మూడు రోజుల్లో ఈ సినిమా మోషన్ పోస్టర్ పనిలో పడ్డాను. ఏప్రిల్ 29న ఆ సినిమా విడుదలైతే మే 20న మోషన్ పోస్టర్ విడుదల చేశాం. అందువల్ల, ఆ ఒత్తిడి నా మీద లేదు. 


అల్లు అర్జున్, మీ కలయికలో సినిమా అనౌన్స్ చేశారు. అదీ, ఇదీ ఒకటేనా?
కాదు అండీ. ఆ కథ వేరు, ఈ కథ వేరు. రెండూ ఒక్కటి కాదు.


మీది, దేవిశ్రీది సూపర్ హిట్ కాంబినేషన్. ఆయన్ను లాస్ట్ రెండు సినిమాల్లో ఆయన్ను తీసుకోలేదు. ఎందుకు?
నేను ఎక్కడో కంఫర్ట్ జోన్ లో ఉంటున్నానని అనిపించింది. దేవిశ్రీతో ఆ విషయం చెప్పా. రెండు సినిమాలు వేరే వాళ్ళతో చేసి మళ్ళీ మీద దగ్గరకు వస్తానని చెప్పా. ఆయనకు కూడా సరేనని అన్నారు. అనిరుద్ రవిచందర్ 'దేవర'కు అద్భుతమైన సంగీతం అందించారు. దేవితో తర్వాత తప్పకుండా పని చేస్తా.


Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే