Devara Movie First Review - 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే

Devara Movie Review In Telugu: 'దేవర' విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొలదీ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని అభిమానులు, ప్రేక్షకుల్లో కుతూహలం పెరుగుతోంది. మరి, ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకోండి.

Continues below advertisement

Jr NTR's Devara First Review In Telugu: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన 'దేవర‌' విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొలది సినిమా ఎలా ఉంది? ఏయే అంశాలు బాగున్నాయి? ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంది? వంటి విషయాలు తెలుసుకోవాలని అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేక్షకులలో సైతం కుతూహలం పెరుగుతోంది.‌ అటువంటి వాళ్ళు అందరికీ బంపర్ క్రేజీ న్యూస్. 'దేవర' ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. 

Continues below advertisement

'దేవర' ప్రివ్యూ చూసిన రాజమౌళి ఫ్రెండ్
సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దేవర సినిమా విడుదల కానుంది. శుక్రవారం మిడ్ నైట్ నుంచి తెలుగు రాష్ట్రాలలో సైతం‌ బెనిఫిట్ షోలు పడనున్నాయి. అంతకు ముందే హైదరాబాద్ సిటీలో స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు 'దేవర' యూనిట్ సభ్యులు.

అటు 'దేవర' కథానాయకుడు ఎన్టీఆర్... ఇటు దర్శక ధీరుడు‌ ఎస్ఎస్ రాజమౌళి... ఇద్దరికీ సన్నిహితులు ఒకరు శుక్రవారం దేవర సినిమా చూశారు. ఆయనకు స్పెషల్ షో పడింది. ఆయన చెప్పిన మాటల ప్రకారం... ''సెకండ్ ఆఫ్ చాలా బాగుంది. చివరి అరగంట అయితే అదిరిపోయింది'' అని సన్నిహితులకు తెలియజేశారట. దాంతో ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానులలో సంతోషం వ్యక్తం అవుతోంది.

'దేవర'కు భారీ డిమాండ్... కొరటాలకు రిలీఫ్
'దేవర'కు ముందు దర్శకుడు కొరటాల శివ తీసిన ఆచార్య ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు సరి కదా విమర్శకులతో పాటు కొంత మంది ప్రేక్షకుల నుంచి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. అటు మెగాస్టార్ చిరంజీవి... ఇటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి యాక్ట్ చేశారని క్రేజ్ ముందు సినిమా తేలిపోయిందని, కొరటాల శివ సరిగా తీయలేదని కొంత‌ మంది కామెంట్లు చేశారు.

Also Read: చంద్రబాబుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ థాంక్స్- నాగవంశీలా తప్పు చేయలేదు!


'ఆచార్య' ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'దేవర' మీద చాలా మంది చూపు పడింది. ఈ సినిమాతో కొరటాల బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. వాళ్ల ఆకాంక్షలకు తగ్గట్టు 'దేవర' సినిమాపై 'ఆచార్య' ఎఫెక్ట్ ఏమీ పడలేదు. ప్రేక్షకులలో ట్రేడ్ సర్కిళ్లను సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో కొరటాల శివకు కొంత రిలీఫ్ వచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఎస్.ఎస్.రాజమౌళి ప్రశాంత్ ని లోకేష్ కనకరాజ్ వంటి పాన్ ఇండియా దర్శకుల సరసన ఆయన కూడా చేరతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

'దేవర'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా... కొడుకు క్యారెక్టర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. విలన్ తరహా కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, చైత్రా రాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించగా... అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.

Also Readవెంకటేష్ సినిమా సెట్స్‌లో బాలకృష్ణ సందడి - ఆ స్మైలూ, ఎఫెక్షనూ సూపరంతే

Continues below advertisement