DEVARA X JIGRA Full Interview: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర’. ఈ నెల 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, బాలీవుడ్ నటి ఆలియా భట్ తో కలిసి కరణ్ జోహార్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఎన్టీఆర్ ‘దేవర’ గురించి, ఆలియా ‘జిగ్రా’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.    


తారక్, ఆలియా ప్రశంసలు


కరణ్ జోహార్ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఫన్నీగా కొనసాగింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ హీరోయిన్లలో ఆలియా ఒకరంటూ ఎన్టీఆర్ ప్రశంసించగా, ఎన్టీఆర్ గొప్ప యాక్టర్ అంటూ ఆలియా అభినందించింది. “ఎన్టీఆర్ గొప్ప నటుడు. కెమెరా ముందు ఈజీగా యాక్టింగ్ చేస్తారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన సీన్స్ చేస్తున్నప్పుడు చాలా సపోర్టుగా నిలిచారు. అప్పుడే మేం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ‘బ్రహ్మాస్త’ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చాం. ఈవెంట్ అయ్యాక ఎన్టీఆర్ వాళ్ల ఇంట్లో డిన్నర్ చేశాం. అప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలి? అబ్బాయి అయితే ఏ పేరు బాగుంటుంది? అమ్మాయి అయితే ఏ పేరు పెట్టాలి? అనే విషయా గురించి డిస్కస్ చేశాం. ‘దేవర’ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఉంది” అని ఆలియా వెల్లడించింది.     


లాస్ట్ 30 నిమిషాలు మరో లెవెల్- ఎన్టీఆర్


‘దేవర’ సినిమా చివరి 30 నిమిషాలు మరోలెవెల్ లో ఉంటుందన్నారు ఎన్టీఆర్. “’దేవర’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా చివరి 30 నిమిషాలు మరో లెవెల్ లో ఉంటుంది. నేను సినిమా ఎంత బాగా చేయాలి అనే ఆలోచిస్తాను. స్టార్ డమ్, ఇమేజ్ గురించి పట్టించుకోను. సినిమాలో గొప్పగా నటిస్తే స్టార్ డమ్, ఇమేజ్ వద్దన్నా వచ్చేస్తాయి. నా కొడుకు అభయ్ పుట్టిన తర్వాత తండ్రిగా గొప్పగా ఫీలయ్యాను. ఆ తర్వాత సినిమాల సెలక్షన్ లోనూ చాలా మార్పు వచ్చింది” అన్నారు ఎన్టీఆర్.


కొరటాల పనితీరు అద్భతం- ఎన్టీఆర్


‘దేవర’ డైరెక్టర్ కొరటాల శివ పని తీరు అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ ప్రశంసించారు. “‘బృందావనం’తో కొరటాలతో  పరిచయం మొదలైంది. ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమా చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ చేశాడు. అదీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘భరత్ అను నేను’ సూపర్ హిట్. ఆయన వరుస సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆయన సినిమాలు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీని కలిగి ఉంటాయి.  మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తారు. అందుకే ఆయనతో కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నాం. ‘RRR’ తర్వాత వస్తున్న ఈసినిమా సినిమాటికల్లీ డ్రమాటిక్ ఎక్స్ పీరియెన్స్ కలిగిస్తుందన్నారు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఆకట్టుకుంటాయన్నారు.



జాన్వీని చూసి షాక్ అయ్యాను- ఎన్టీఆర్


హీరోయిన్ జాన్వీ కపూర్ చక్కటి యాక్టర్ అంటూ ఎన్టీఆర్ ప్రశంసలు గుప్పించారు. “జాన్వీ నటన, డ్యాన్స్ అన్నింట్లో అద్భుతంగా రాణిస్తుంది. ఫస్ట్ సీన్ లోనే ఆమె యాక్టింగ్ చూసి స్టన్ అయ్యాను. పేజిన్నర డైలాగ్ ను ఆపకుండా చెప్పేసింది. నేను షాక్ అయ్యాను. శివ్ వన్ సెకెన్ చెక్ చేస్తా అన్నారు. చెక్ చేయడానికి ఏం లేదు. ఓకే చెప్పేయమన్నాను. హాస్పిటల్ నుంచి వచ్చి తను చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది” అంటూ ప్రశంసించారు.  చివరగా ఆలియా ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే చుట్టేస్తానే’  అనే పాటను పాడి అందరినీ అలరించింది.  



కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు అలియా భట్ 'జిగ్రా' సినిమాతో అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.  కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు వాసం బాల దర్శకత్వం వహించారు. విదేశీ జైల్లో ఉన్న తన సోదరుడిని సోదరి ఎలా కాపాడింది? అనే కథాశంతో ‘జిగ్రా’ తెరకెక్కింది. 


Read Also: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారం ఏకంగా 24 మూవీస్ రిలీజ్, స్పెషల్ ఏవో తెలుసా?