ఇండియాలో అత్యంత చెత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే మోడల్, నటి ఎవరని అడిగితే.. వెంటనే వచ్చే సమాధానం.. ఉర్ఫీ జావెద్. ఈమెకు బుల్లితెర నటి కంటే.. ఈ చిత్ర విచిత్ర దుస్తులతోనే ఎక్కువ గుర్తింపు లభించింది. ఈ పాపులారిటీ వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమెకు రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సరికొత్తగా ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఈమెకు ఎవరూ పోటీ రాలేరు. అందుకే, 2021లో హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది.
తన అందాలను ఎక్స్‌పోజ్ చేసే దుస్తులు వేసుకోవడమంటే ఉర్పీకి చాలా ఇష్టం. అయితే, ఈమె ఎక్కడో ఈవెంట్స్‌లో క్యాట్ వాక్ చేయడానికి ఈ దుస్తులు వేసుకోదు. తన పాపులారిటీని పెంచుకోడానికి మాత్రమే ధరిస్తుంటుంది. ఉర్ఫీ అలాంటి దుస్తులను ధరించి నేరుగా పబ్లిక్‌లోకే వచ్చేస్తుంది. ఆమె ఫోటోలను కెమేరాలో బందించేందుకు బాలీవుడ్ మీడియాకు చెందిన ఫోటోగ్రాఫర్లు బారులు తీరుతారు. ఇటీవల ఆమె ధరించిన పువ్వుల డ్రెస్ వైరల్‌గా మారింది. ఆమె పూర్తిగా తన టాప్‌ను తొలగించి తన పరువాలను పువ్వులతో కవర్ చేస్తూ.. కేవలం స్కిన్ కలర్‌లో కలిసిపోయే షార్ట్ మాత్రమే ధరించి అందరినీ నోరు వెళ్లబెట్టేలా చేసింది. తాజాగా ఆమె గాజు పెంకుల డ్రెస్ వేసుకుని మరోసారి ఆశ్చర్యపరిచింది. ఆమె డ్రెస్‌ను పొరపాటున తాకినా చేతులు కోసుకుపోయే ప్రమాదం ఉంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉర్ఫీ జావెద్ 3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించింది. ఈ సందర్భంగా ఆమె ఓ పార్టీ ఏర్పాటు చేసింది. అందులో ఆమె 20 కిలోల బరువుండే గాజు ముక్కల డ్రెస్‌ను ధరించింది. అయితే, అవి కోసుకుంటున్నాయనే కారణంతో వేరే డ్రెస్ వేసుకుందట. పగిలిన గాజుల డ్రెస్‌తో వాక్ చేస్తున్న వీడియోను ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ డ్రెస్ చూసి కొందరు నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇది సెల్ఫ్ డిఫెన్స్ డ్రెస్ అని, ఆమెను తాకినా హగ్ చేసుకున్న ప్రమాదమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ చూసి మీరు కూడా స్పందన తెలపండి.
Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!