Pawan Kalyan Son Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనంటే అభిమానులకు ప్రాణం. ఇక ఆయన తన వారసుడు అకీరా నందన్‌ను కలిశాడంటే చాలు.. అభిమానుల తెగ మురిసిపోతుంటారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల వల్ల కొడుకు అకిరా, కూతురు ఆద్యలు తల్లి రేణు దేశాయ్‌తోనే ఉంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు వారిని కలుస్తూనే ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో పవన్ పిల్లలతోనే గడుపుతుంటారు. తాజాగా అకీరా స్కూల్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తన పిల్లలు, రేణ దేశాయ్‌తో కలిసి ఫొటో తీసుకున్నారు.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
రేణు దేశాయ్ ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన కొడుకు అకిరాను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఒక శకం ముగుసిందంటే మరో శకం ప్రారంభమవుతుంది. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం. ఇక ఉదయాన్నే స్కూల్‌కు సిద్ధం కావక్కర్లేదు. బస్సు టైమింగ్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. భోజనం సమయానికి ప్యాక్ చేయడానికి తొందరపడక్కర్లేదు. ట్యూషన్‌లు లేవు, పేటీఎం లేదు, పాఠశాల లేదు. నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుందని నేను అకిరాతో చెప్పాను. అతను తన తల్లిదండ్రుల ‘కాంతి’ అవసరం లేకుండా ‘సూర్యకాంతి’లో తనదైన స్థానాన్ని కనుగొంటాడని నేను ఆశిస్తున్నాను. నా చిన్న బిడ్డ చాలా వేగంగా పెరిగాడు’’ అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అకిరా ఏ రంగాన్ని ఎంచుకుంటాడనే చర్చ సాగుతోంది. పవన్ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెడతాడా? లేదా మరేదైనా రంగాన్ని ఎంచుకుంటాడా అనేది భవిష్యత్తే చెబుతుంది. ప్రస్తుతమైతే రేణు గానీ, పవన్ గానీ.. తన కొడుకు సినీ రంగ ప్రవేశం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విడాకులు తీసుకున్నా.. రేణు దేశాయ్ తన పిల్లలను మెగా ఫ్యామిలీకి దూరం చేయలేదు. చిరు ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పిల్లలను పంపిస్తారు. ప్రస్తుతం అకిరాకు 17 ఏళ్లు మాత్రమే. సినిమాల్లోకి రావాలంటే ఇంకా చాలా సమయం ఉంది. అయితే, అభిమానులు మాత్రం అంతవరకు ఆగేలా లేరు. అకిరాను హీరోగా చూడాలని ఉందంటున్నారు.
Also Read: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?