రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'శేఖర్' గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. ఈ వివాదంలో చిత్రబృందానికి అనుకూలంగా న్యాయమూర్తి మాట్లాడినట్టు సమాచారం. 'శేఖర్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామసలు చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.


కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారని తెలుస్తోంది. కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని సమాచారం. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు జీవిత రాజశేఖర్, నిర్మాత తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.


జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, శివాని రాజశేఖర్ నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రథమార్థం స్లోగా సాగినా... ద్వితీయార్థం రేసీగా ఉంటుంది. ఎమోషనల్ నోట్‌లో సినిమాను ముగించారు.