Prabhas as Rudra Look : 'కన్నప్ప' మూవీ నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ వచ్చేసింది. డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.
రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ అవుట్...
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథాలజికల్ మూవీ 'కన్నప్ప'. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో పలువురు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, బడా స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అన్నిటికంటే ఎక్కువగా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న అప్డేట్ మాత్రం ప్రభాస్ కు సంబంధించిందే. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి పలువురు స్టార్ హీరోల ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసిన మేకర్స్, ప్రభాస్ ఫస్ట్ లుక్ ను మాత్రం ఇన్ని రోజులు సస్పెన్స్ లో పెట్టి, మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశారు.
ఇక రీసెంట్ గా ఈ ఎదురు చూపులకు తెరపడబోతోంది అంటూ 'కనప్ప' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా వెల్లడించారు. అందులో మాత్రం కేవలం ప్రభాస్ కళ్ళు, నుదుటి భాగాన్ని మాత్రమే చూపించారు. నుదుటిపై విభూది నామాలు, చేతిలో త్రిశూలంతో డార్లింగ్ పవర్ ఫుల్ గా కనిపించడంతో ఆ పోస్టర్ వెంటనే వైరల్ అయింది. చెప్పినట్టే తాజాగా 'రుద్ర'గా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు 'కన్నప్ప' మేకర్స్. అందులో " రుద్రగా రెబల్ స్టార్ ప్రభాస్... ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు" అంటూ బ్యాక్ గ్రౌండ్లో మహా శివుడు, ఆయన ముందు ప్రభాస్ నిలబడి ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో వైరల్ అవుతుంది.
శివ పార్వతులుగా కాజల్, అక్షయ్
ఇక ఇప్పటికే 'కన్నప్ప' మూవీ నుంచి మహా శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా కనిపించబోతున్నారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్ వంటి నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లలో వారివారి రోల్స్ ను కూడా పరిచయం చేశారు. కాగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ మూవీకి అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'కన్నప్ప' మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మరి ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.
Also Read : వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?