Sandeep Reddy Vanga : 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga : 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్​కు గెస్ట్​గా హాజరైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' మూవీ హీరోయిన్ గా సాయి పల్లవికి ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందో వెల్లడించారు.

Continues below advertisement

Director Sandeep Reddy Vanga : స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనగానే ముందుగా గుర్తొచ్చేది 'అర్జున్ రెడ్డి'. ఫస్ట్ మూవీ తోనే సందీప్ రెడ్డి వంగా తన ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. ఇక 'అర్జున్ రెడ్డి' కారణంగా విజయ్ దేవరకొండ, శాలిని పాండే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి అనుకున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనే ఆమెను పక్కన పెట్టారట. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగా స్వయంగా 'తండేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు. ఆయన కామెంట్స్ పై సాయి పల్లవి సైతం స్పందించింది. 

Continues below advertisement

అర్జున్ రెడ్డిలో సాయి పల్లవి... రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగా 

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' మూవీ ఫిబ్రవరి 7న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా రావాల్సి ఉంది. కానీ ఆయన బదులు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ పై 'అర్జున్ రెడ్డి' సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నామంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.

'ప్రేమమ్' మూవీ నుంచి తనకు సాయి పల్లవి యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పిన సందీప్ రెడ్డి వంగా, 'అర్జున్ రెడ్డి' సినిమాలో ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నామని వెల్లడించారు. దీని గురించి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ "అర్జున్ రెడ్డి మూవీ కోసం సాయి పల్లవి హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనతో కేరళ కు చెందిన కోఆర్డినేటర్ కి కాల్ చేశాను. అర్జున్ రెడ్డి మూవీ రొమాంటిక్ స్టోరీ అని, సాధారణంగా తెలుగు సినిమాల్లో ఉండేదాని కంటే కాస్త ఎక్కువగానే రొమాన్స్ ఉంటుందని చెప్పాను. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుందా అని అడిగితే... ఆ విషయం మర్చిపోండి కనీసం ఆ అమ్మాయి స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని చెప్పారు. అయితే చూద్దాం అవకాశాలను బట్టి, కాలాన్ని బట్టి ఆ తర్వాత అందరూ మారిపోవాల్సిందే అనుకున్నాము. బహుశా పెద్ద అవకాశాలు వస్తే అలా నటిస్తారేమో అని అనుకున్నాము. కానీ సాయి పల్లవి మాత్రం పదేళ్లుగా ఏం మారలేదు. చాలా గ్రేట్" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 

సాయి పల్లవి రియాక్షన్... 

ఈ సందర్భంగా సాయి పల్లవి తన స్పీచ్ లో సందీప్ రెడ్డి వంగా చెప్పిన విషయంపై స్పందించారు. "ప్రతి డైరెక్టర్ కి ఒక వాయిస్ ఉండాలి. అలా సందీప్ రెడ్డి వంగా గారికి ఒక అన్ ఫిల్టర్ వాయిస్ ఉంది. మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారు. నాకు అసలు మేనేజర్ లేరు. మీరు ఎవరితో మాట్లాడారు అనేది తెలీదు. అర్జున్ రెడ్డి మూవీ ఎలా రావాలని ఉందో అలాగే వచ్చింది. ఈ సినిమాలో శాలిని, విజయ్ అద్భుతంగా నటించారు. ఎవరు ఏ మూవీ చేయాలని రాసి ఉంటే వాళ్లే చేస్తారు" అంటూ చెప్పుకొచ్చింది. సందీప్ రెడ్డి వంగా తొలి మూవీ 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా చేయగా, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం విదితమే.

Also Readనందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!

Continues below advertisement