మ మ మహేషు సాంగ్‌ని తను ఇప్పటికే చూశానని, ఇలాంటి మహేష్ బాబును ఇప్పటివరకు చూడలేదని ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ అన్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో సుకుమార్ పాల్గొని మాట్లాడారు.


ఈ కార్యక్రమంలో సుకుమార్ మాటలివే...‘సర్కారు వారి పాట ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాతలు నాకు బాగా కావాల్సిన వారు. వారందరికీ ఆల్‌ది బెస్ట్. బుజ్జి (పరశురామ్) నాకు చాలా కాలం నుంచి తెలుసు. తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి తనను చూస్తున్నాను. ఇప్పుడు ఉన్న బెస్ట్ డైలాగ్ రైటర్స్ కొద్ది మందిలో తను కూడా ఒకరు. గీత గోవిందం తరహాలో సెన్సిబుల్‌గా కథను చెప్పే ఆర్ట్ తన దగ్గర ఉంది. తను మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. బుజ్జికి ఆల్ ది బెస్ట్.’


‘మహేష్ బాబు నాకు 1-నేనొక్కడినే సమయంలో చాలా సపోర్ట్ చేశారు. ఆయన సెట్లో డైరెక్టర్ మహారాజులా ఫీల్ అవుతారు. అంత బాగా చూసుకుంటారు. డైరెక్షన్ చేసేటప్పుడు ఆయన మళ్లీ మరో టేక్ అంటే చాలా ముద్దుగా ఉంటుంది. నా జీవితంలో ఆ సినిమా చేసిన రోజులు మళ్లీ మర్చిపోలేను. మహేష్ బాబును ఇంత జోవియల్‌గా చూడటం చాలా ఆనందంగా ఉంది.’


‘మైత్రీ మూవీ మేకర్స్  విజయ పరంపరలో ఈ సినిమా ఒక మైలురాయి కావాలని కోరుకుంటున్నాను. థమన్ స్వరపరిచిన కళావతి, మహేష్ సాంగ్స్ నాకు ఎంతో నచ్చాయి. మిగతా టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్.’ అంటూ సుకుమార్ తన స్పీచ్ ముగించారు.