టికెట్ రేట్లు తగ్గితే ఇంత లాభమా - ఒక్క రోజులో 60 లక్షల మంది అంటే మాటలా?
థియేటర్లలో సినిమాలు చూడటం ప్రేక్షకులు ఎందుకు తగ్గించారు? ఈ ప్రశ్నకు మెజారిటీ జనాలు చెప్పే సమాధానాలతో టికెట్ రేట్లు ముఖ్యమైన అంశం. మన దేశంలో మెజారిటీ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్లు మొదలు అయ్యాయి. ఢిల్లీ, ముంబై వంటి మెట్రోపాలిటన్ సిటీలలో తప్పిస్తే... మెజారిటీ ఏరియాల్లో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు రూ. 200 నుంచి రూ. 300 మధ్యలో ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రూ. 500 కూడా ఉన్నాయనుకోండి! సగటు సామాన్య మధ్య తరగతి ప్రేక్షకుడు కుటుంబంతో సినిమాకు వెళితే కనీసం 1500ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అందుకని, సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప చాలా మంది మల్టీప్లెక్స్ వైపు చూడటం లేదు. ఒకవేళ మల్టీప్లెక్స్ టికెట్ రేట్స్ తగ్గిస్తే? జనాలు రావడానికి రెడీగా ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... నేషనల్ సినిమా డే! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ప్రేమికుడా... హంతకుడా... ఆ మారణ హోమాన్ని ఆపేది ఎవరు? 'స్పార్క్' ట్రైలర్ చూశారా?
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'స్పార్క్ L.I.F.E' (Spark Movie). డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఒకే చితిలో రెండు శవాలు, చేతబడితో మళ్ళీ వచ్చిన 'సత్యం' రాజేశ్ - 'పొలిమేర 2' ట్రైలర్!
బాక్సాఫీస్ బరిలో హారర్ & థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. కంటెంట్ బావుంటే చాలు... హారర్ సినిమాల్లో స్టార్లు ఉన్నారా? లేరా? అని జనాలు ఎప్పుడూ చూడరు. అందుకే. 'సత్యం' రాజేష్ కథానాయకుడిగా నటించిన 'మా ఊరి పొలిమేర' మీద ప్రశంసలు కురిపించారు. ఓటీటీలో విడుదలైన ఆ సినిమాకు మంచి పేరు రావడంతో 'మా ఊరి పొలిమేర 2' తెరకెక్కించారు. ఇది థియేటర్లలో విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'గాంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్ ప్రీ లుక్ చూశారా? - రేపే ఫస్ట్ హై!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా  మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. అంటే... ఆయన శ్రీమతి సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'భగవంత్ కేసరి' సెన్సార్ హోగయా - ఫస్ట్ రివ్యూ ఏంటంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie) విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేశారు. ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. 'భగవంత్ కేసరి' సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలతో కలిసి పిల్లలు కూడా థియేటర్లకు వెళ్ళవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఉన్నపటికీ... వాటిలో వయలెన్స్ మోతాదు మించలేదని తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)