విక్రాంత్ (Vikranth) హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'స్పార్క్ L.I.F.E' (Spark Movie). డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 


హీరోయిన్లు ఇద్దరితోనూ ప్రేమ!
Spark Movie Trailer Review : 'స్పార్క్' ట్రైలర్ ప్రారంభం చూస్తే... ఇదొక ప్రేమ కథ అనిపిస్తుంది. మెహరీన్, రుక్సార్... ఇద్దరితోనూ హీరో విక్రాంత్ లవ్ చేసే సీన్స్ ఉన్నాయి. బస్ స్టాపులో చూసిన రుక్సార్ వెంట హీరో పడితే... హీరోని ప్రేమలో పడేస్తాని చెప్పే అమ్మాయిగా మెహరీన్ కనిపించారు. స్టార్ కమెడియన్లు 'వెన్నెల' కిశోర్, సత్య కూడా కనిపించారు. అయితే... ఆ ఇద్దరు అమ్మాయిలతో తిరుగుతూ వాళ్ళను మోసం చేస్తున్నాడా? అని అనుమానం కలుగుతుంది. అయితే... కొద్ది క్షణాలు ట్రైలర్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ టర్న్ తీసుకుంది. 


ఆ మరణ హోమం ఏమిటి? 
ట్రైలర్ మొదలైన నిమిషం తర్వాత... ఓ అమ్మాయి తర్వాత మరొకరు, వరుసగా హత్యలకు గురైన అమ్మాయిలను చూపించారు. అవి చేసినది హీరో అన్నట్లు చూపించారు. హీరో వెనుక పోలీసులు ఎందుకు పడ్డారు? ఒకవేళ అతనే హత్యలు చేసినట్లు అయితే ఎందుకు చేశారు? ఆ మారణ హోమాన్ని ఎవరు ఆపారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, శ్రీకాంత్ అయ్యంగార్, సుహాసినీ మణిరత్నం తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.  


Also Read  'గాంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్ ప్రీ లుక్ చూశారా? - రేపే ఫస్ట్ హై!



విలన్ గురు సోమసుందరం సైతం ట్రైలర్లో కనిపించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో విక్రాంత్ దర్శకత్వం వహించారు. ఆల్రెడీ విడుదల అయిన పాటలకు మంచి స్పందన రావడం పట్ల విక్రాంత్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన చెప్పారు. మలయాళ హిట్ 'హృదయం', విజయ్ దేవరకొండ 'ఖుషి' చిత్రాలకు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించిన హిషామ్ అబ్దుల్ వాహెబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 


Also Read ఒకే చితిలో రెండు శవాలు, చేతబడితో మళ్ళీ వచ్చిన 'సత్యం' రాజేశ్



నవంబర్ 17న 'స్పార్క్' విడుదల!
నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'స్పార్క్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కొత్త హీరో, కొత్త దర్శకుడు అయినప్పటికీ... ప్రచార చిత్రాలు, పాటలు బావుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 'స్పార్క్'లో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర సహాయకుడిగా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial